జాతీయ వార్తలు

ప్రత్యూష పిలుస్తోంది.. వెళ్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: చిన్నారి పెళ్లికూతురు టివి నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు రోజురోజుకు కొత్త మలుపుతిరుగుతోంది. బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వేధింపుల వల్లే ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె స్నేహితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
అపస్మారక స్థితిలో ప్రత్యూషను ఆసుపత్రికి తీసుకొచ్చిన రాహుల్ ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించగానే అక్కడి నుంచి జారుకున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈకేసును పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. బాయ్‌ఫ్రెండ్‌ను పోలీసులు విచారించారు. కాగా ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి తమ కుమారుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని రాహుల్ తండ్రి తెలిపాడు. తమ కొడుకు ఆరోగ్యం బాగోలేదని, ప్రస్తుతం ఐసియులో ఉంచి వైద్య సేవలందిస్తున్నట్టు అతడు పేర్కొన్నాడు. ‘ప్రత్యూ ష నన్ను పిలుస్తోంది..నేను వెళ్లిపోతానంటూ’ రాహుల్ కలవరిస్తున్నాడని తండ్రి చెప్పుకొచ్చాడు.
తమ కుమారుడు ఏమైపోతాడోన్న ఆందోళన వ్యక్తం చేసిన తండ్రి ‘ప్రత్యూష ఆత్మకు శాంతి చేకూరాలి. నా కుమారుడు కోలుకోవాలని ప్రార్థన చేయాలి’అని విజ్ఞప్తి చేశాడు. టివి నటి ఆత్మహత్యకు రాహుల్ కారణమంటూ వస్తున్న వార్తలను అతడి బంధువులు తోసిపుచ్చారు.

ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనం
పాక్‌పై భారత్ ఆగ్రహం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికి ‘వ్యూహ రచన’ చేసింది భారత దేశమేనంటూ పాకిస్తాన్ మీడియాలో వచ్చిన కథానాలపై భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పాక్ భద్రతా విభాగం ద్వంద్వ నాల్కల ధోరణిని అవలంబిస్తోందనడానికి ఈ కథనాలే నిదర్శనమని భారత్ నిప్పులు చెరిగింది. ‘పఠాన్‌కోట్‌లో దాడికి పాల్పడింది పాకిస్తానీ ఉగ్రవాదులేనని రుజువుచేసే తిరుగులేని సాక్ష్యాధారాలను పాక్ సంయుక్త దర్యాప్తు బృందానికి (జెఐటికి) అందజేశాం. అయినప్పటికీ ఈ దాడికి వ్యూహ రచన చేసింది భారత దేశమేనంటూ కేవలం పాకిస్తాన్ ప్రభుత్వ అనుకూల దినపత్రికలో మాత్రమే కథనం వెలువడటం పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్)తో పాటు ఆ దేశ సైనిక దళం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నట్లు రుజువు చేస్తోంది’ అని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.