జాతీయ వార్తలు

కష్టపడి పనిచేసి ప్రజాదరణ పొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఏప్రిల్ 5: పనితీరులో నూ, సమర్ధవంతమైన పాలన అం దించడంతో మంత్రులు ముందుండాలని, లేపిక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కొత్త కేబినెట్‌కు దిశానిర్దేశం చేశారు. కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సోమవారం రాత్రి తొలి మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని ఉద్ఘాటించారు. కాశ్మీర్ తొలి మహిళా సిఎంగానే కాకుంగా దేశంలోనే రెండో ముస్లిం ముఖ్యమంత్రిగా మెహబూబా రికార్డు నెలకొల్పారు. ముఫ్తీ మహ్మద్ సరుూద్ మరణం తరువాత మూడు నెలల పాటు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం లేకుండాపోయింది. సోమవారంతో గవర్నర్ పాలనకు తెరపడింది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మెహబూబా పాలనను గాడిలోపెట్టే పని ప్రారంభించారు. వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మంత్రులకు శాఖలు కేటాయించారు. బిజెపికి చెందిన డిప్యూటీ సిఎం నిర్మల్ సింగ్‌కు విద్యుత్, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు. పిడిపికి చెందిన కొత్త మంత్రి అబ్దుల్ రెహ్మాన్ భట్‌వీరికి ఆర్‌ండ్‌బి, శాసన సభ వ్యవహారాలు అప్పగించారు. హసీబ్ ద్రాబు(పిడిపి)కి కీలకమైన ఆర్థిక, ప్రణాళిక, సాంస్కృతిక శాఖలు కేటాయించారు.నీమ్ అక్తర్(పిడిపి)కు మళ్లీ విద్యాశాఖ అప్పగించారు. అబ్దుల్ హక్(పిడిపి)కి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను ముఖ్యమంత్రి మెహబూబా కేటాయించారు. సయ్యిద్ బష్రాత్ బుఖారీ(పిడిపి)కి రెవిన్యూ, సహాయ, పునరావాస శాఖలు అప్పగించారు. అలాగే బాలి భగరత్(బిజెపి)కి వైద్య, ఆరోగ్య శాఖ, సజాద్ లోనే(పీపుల్స్ కాన్ఫరెన్స్)కు సాంఘి సంక్షేమశాఖ, చౌదరీ జుల్ఫికర్(పిడిపి)కి ప్రజాపంపిణీ, చౌదరీ లాల్‌సింగ్(బిజెపి)కి అడవులు, పర్యావరణం, అబ్దుల్ ఘనీ కొహ్లీ (బిజెపి)కి పశు సంవర్ధక శాఖలు కేటాయించారు. ఇక సాధారణ పరిపాల, హోమ్, పర్యాటక శాఖలు ఎవరికీ కేటాయించకుండా సిఎం వద్దే ఉంచుకున్నారు.