జాతీయ వార్తలు

మేక్ ఇన్ ఇండియాతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా మూలంగా దేశంలోని లక్షలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నిండుతోందని ఆయన ప్రశంసించారు. దేశంలోని వివిధ రంగాలకు చెందిన కార్మికుల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా చూసేందుకు తమ శాఖ పలు చట్టాలను చేసిందని ఆయన తెలిపారు. మంగళవారం విజ్ఞాన్ భవన్‌లో 31వ ఏపిఓఎస్‌హెచ్‌ఓ సదస్సు (ఆసియా పసిఫిక్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్)ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా మన దేశాన్ని స్వయం సమృద్ధి దేశంగా మార్చివేస్తుందని ఆయన ప్రకటించారు. బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు భారత దేశం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నదని చెప్పారు. పని ప్రాంతాల్లో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయటంతో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారని దత్తాత్రేయ చెప్పారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించటంతోపాటు కనీస వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు.
భారత దేశంలో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉన్నది, సామూహిక బేరసారాలు చేసే హక్కు ఉన్నదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉత్పత్తిరంగం, ఓడరేవులు, గనుల తవ్వ కం, నిర్మాణ రంగంలో కార్మికులకు భద్రత, ఆరోగ్యం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దత్తాత్రేయ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత గత 68 సంవత్సరాల్లో కార్మికుల ఆశలు, ఆశయా లు చాలావరకు తీరాయని అంటూ కార్మిక సంక్షేమం, భద్రత దిశగా కార్మిక చట్టాలు ముందుకు సాగాయని ఆయన ప్రకటించారు. కార్మిక చట్టాలకు సంస్థాపరమైన ఆకారం లభించిందని చెప్పారు.
భారతదేశం అంతర్జాతీయ తయారీ దేశంగా మారటం వలన కార్మికులకు ఊహించనంత మేలు కలుగుతుందని దత్తాత్రేయ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ శాఖ పలు చర్యలు తీసుకుంటోందని, ఇందుకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం పార్లమెంటు పరిశీలనలో ఉన్నదని దత్తాత్రేయ చెప్పారు.