జాతీయ వార్తలు

సుప్రీం సిజెతో కెసిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్‌ను కలిసి ప్రత్యేక హైకోర్టుపై చర్చించారు. మొదట ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టినందుకు జస్టిస్ ఠాకూర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు ఆవశ్యకతపై వివరించారు. రాష్ట్ర విభజన జరిగి పద్దెనిమిది నెలలు కావస్తున్నా ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయకపోవటం వలన తెలంగాణాకు జరుగుతున్న నష్టం గురించి థాకుర్‌కు వివరించారు.
ఏపి ఉన్నత విద్యామండలి
ఖాతాలపై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి సంబంధించిన ఖాతాల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జనవరి 5కు వాయిదా పడింది. రెండు రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు విచారణకు హాజరుకానందున జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్ విచారణను వాయిదా వేశారు.

అమరావతిపై గ్రీన్ ట్రిబ్యునల్
విచారణ వచ్చేనెల 15కు వాయిదా

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పర్యావరణ అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో చట్టవిరుద్ధంగా రాజధాని నిర్మిస్తోందని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన పి శ్రీమన్నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ జనవరి పదిహేనుకు వాయిదా వేసింది. జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడుకున్న బెంచి బుధవారం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పర్యావరణ అనుమతులు లభించినప్పటికీ రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఎదురయ్యే ముంపుప్రమాదంపై నివేదికలు అందలేదని వీరు తెలియజేశారు. జనవరి 15 నాటికి పిటిషన్‌దారు ప్రస్తావించిన అభ్యంతరాలపై నివేదికను అందించాలని ధర్మాసనం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.