జాతీయ వార్తలు

నా పేరును దుర్వినియోగం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: సంచలనం సృష్టించిన ‘పనామా’ డాక్యుమెంట్ల స్కాంలో తన పేరు ప్రతిష్ఠలను దుర్వినియోగం చేశారని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మంగళవారం ఖండించారు. పనామా పత్రాల లీకేజీ వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖుల జాబితాలో అమితాబ్ కుటుంబం పేరు ప్రముఖంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘‘నా పేరును తప్పుగా వాడారని నేను భావిస్తున్నాను. నేను అన్ని పన్నులను సక్రమంగా చెల్లించాను. విదేశాల్లో ఖర్చు చేసిన సొమ్ముకు కూడా సరైన పన్నులు చెల్లించాను’’ అని అమితాబ్ ఏఎన్ ఐ కి ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు.