జాతీయ వార్తలు

ఉద్యోగార్థులే ఉపాధి సృష్టికర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు 3స్టాండప్ ఇండియా2 పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. ఉద్యోగార్థులు ఉపాధి అవకాశాలను సృష్టించే వారుగా ఎదిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. 3దళితులతో పాటు పేదలకు అవకాశం కల్పిస్తే వారు దేశంలోని పలు సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూర్చగలుగుతారు. అందుకే స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభిస్తున్నాం.
దళిత, గిరిజన ప్రజల జీవితాల్లో ఈ పథకం వెలుగులు నింపబోతోంది2 అని మోదీ పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకు మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశం సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయన జయంతి సందర్భంగా స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రధాని తెలిపారు. ప్రతి భారతీయుడికి సాధికారత కల్పించాలన్నదే స్టాండప్ ఇండియా లక్ష్యమని, అందరూ తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఈ పథకం వీలుకల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. కొత్త పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం ఈ పథకం కింద వారికి 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలను అందజేస్తారు. ఈ పథకం కింద రుణాలు పొందే ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రీ-లోన్ ట్రైనింగ్, ఫెసిలిటేషన్ లోన్, ఫ్యాక్టరింగ్, మార్కెటింగ్ తదితర అంశాల్లో సమగ్రమైన తోడ్పాటును ఇవ్వడంతో పాటు నగదు విత్‌డ్రాయల్స్ కోసం 3రూపే2 డెబిట్ కార్డులను అందజేస్తారు. 3స్టాండప్ ఇండియా2 పథకం అమలు కోసం ప్రభుత్వం చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ), నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌సిజిటిసి) ద్వారా రూ.10 వేల కోట్లతో రీఫైనాన్స్ విండోను ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్ల మూల నిధిని ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, సపోర్టు సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటుచేసి రుణగ్రహీతల పరపతి వివరాలను సిద్ధం చేయనుంది.

నోయడాలో మంగళవారం స్టాండప్ ఇండియా ప్రారంభించి రిక్షా ప్యాసింజర్స్‌కు ఇపేమెంట్ గురించి వివరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ. చిత్రంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇతర అధికారులు ఉన్నారు.

పేదల నిజాయితీ నిరుపమానం
రుణాల ఎగవేతపైనే సంపన్నుల దృష్టి
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య

నోయిడా, ఏప్రిల్ 5: విజయ్ మాల్యా వంటి కార్పొరేట్ దిగ్గజాలపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ధ్వజమెత్తారు. పేదలే నిజాయితీ పరులని, ఉదార స్వభావులని పేర్కొన్న ఆయన ధనికులు తీసుకున్న రుణాలను ఎగవేయడానికే ప్రయత్నిస్తారని అన్నారు. తాము తీసుకున్న బ్యాంకు రుణాలను తీర్చేందుకే పేదలు శతవిధాలుగా ప్రయత్నిస్తారని, సంపన్నులు మాత్రం రుణాలు ఎలా ఎగవేయాలన్నదానిపైనే దృష్టి పెడతారని తెలిపారు. ప్రధాన మంత్రి జనధన యోజనలో భాగంగా పేదలకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచినప్పటికీ వీటిలో 35వేల కోట్ల రూపాయలు జమ అయ్యాయని అన్నారు. పేదల ఉదార స్వభావం గురించి, నీతినిజాయితీ గురించి దేశంలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయన్నారు. మాల్యా పేరును నేరుగా ప్రస్తావించక పోయినా సంపన్నులు బ్యాంకు రుణాలను ఎగవేస్తారన్న ప్రధాని ప్రస్తావనలో ఆయన పేరు ధ్వనించింది.