జాతీయ వార్తలు

మానవ బాంబర్ల సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 6: ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుని విధ్వసం సృష్టించేందుకు పాకిస్తాన్‌కు చెందిన ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సంచరిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు బుధవారం హెచ్చరించాయి. మారుతీ స్విఫ్ట్ జైర్ కారులో వీరు తిరుగుతున్నట్టుగా వెల్లడించాయి. వీరి వద్ద భారీ ఆయుధాలు, ఆత్మాహుతి దాడి జరిపేందుకు బెల్టులు కూడా ఉన్నట్టుగా స్పష్టం చేసింది. ఈ కారు నెంబర్‌ను జెకె-01 ఎబి-2654గా ముంబయి పోలీసులు ధృవీకరించారు. అలాగే పంజాబ్‌కు చెందిన ఓ స్థానికుడు కూడా కారులోనే ఉన్నట్టు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ విస్తృత స్థాయిలో తనిఖీలు జరపాలని, అనుమానం వచ్చిన ఎవరినీ వదిపెట్టవద్దంటూ ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రధాన భవనాలు, కీలక స్థావరాలు, విద్యా సంస్థలు, మార్కెట్లు ఇలా జనసమ్మర్దంగా ఉండే అన్ని ప్రాంతాల్లోనూ నిఘా, భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ఇంతకు ముందే పాక్ ఉగ్రవాదుల కదలికల గురించి ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాక్ నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్టుగా కేంద్ర నిఘావర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఆ హెచ్చరికలు జారీ అయ్యాయి.