జాతీయ వార్తలు

ఇక అంతా స్మార్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: రైతులకు స్మార్ట్ పంపుసెట్లు, ఇళ్లు, దుకాణాలు సంస్థలకు స్మార్ట్ ఫ్యాన్లు వస్తున్నాయి. కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ గురువారం విజయవాడలో స్మార్ట్ పంపుసెట్లు, ఫ్యాన్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పియూష్ గోయల్ కార్యాలయం తెలిపింది. స్మార్ట్ పంపు సెట్లను రైతులు తమ మొబైల్స్ సహాయంతో ఇంటినుండే నిర్వహించవచ్చునని పియూష్ గోయల్ చెబుతున్నారు. జాతీయ ఇంధన పొదుపు వ్యవసాయ పంపుసెట్ల కార్యక్రమం, జాతీయ ఇంధన పొదుపు ఫ్యాన్ కార్యక్రమాన్ని రేపు పియూష్ గోయల్, చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. రెండు పథకాలను కేంద్ర ఇంధన శాఖ, ఇంధన పొదుపు సేవల సంస్థ (ఇఇఎస్‌ఎల్) సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఇంధన పొదుపు వ్యవసాయ పంపు సెట్ల కార్యక్రమం కింద రైతులు డీజిల్‌ను పెద్దమొత్తంలో ఉపయోగించుకునే పాతతరం వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో అధునాతన ఇంధనాన్ని పొదుపుచేసే వ్యవసాయ పంపు సెట్లను రైతులకు అందజేస్తారు. ఈ పంపు సెట్లకు ఐదు నక్షత్రాల రేటింగ్ ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ తెలిపింది. ఆధునిక పంపు సెట్లకు స్మార్ట్ కంట్రోల్ సౌకర్యంతోపాటు మొబైల్ సిమ్ కార్డును పెట్టుకునే వీలుంటుంది. ఈ స్మార్ట్, సిమ్ కార్డ్‌తో పనిచేసే ఆధునిక వ్యవసాయ పంపు సెట్లను రైతులు తమ ఇంటి నుండే నిర్వహించేందుకు వీలుంటుంది. రైతులు తమ ఇంటినుండే పొలంలో ఉన్న పంపు సెట్లను నడపడం లేదా ఆపటం వంటిది చేయవచ్చు. ఈ సిమ్ ఆధారిత ఆధునిక వ్యవసాయ పంపుసెట్లను ఏర్పాటు చేయటం వలన 2019 నాటికి మూడు శాతం విద్యుత్తును పొదుపు చేసేందుకు వీలు కలుగుతుందని పియూష్ గోయల్ అంచనా వేస్తున్నారు. మూడు శాతం విద్యుత్తును పొదుపు చేయటం అంటే సాలీనా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదా చేయటం లేదా యాభై మిలియన్ యూనిట్ల విద్యుత్తును పొదుపు చేయటమని ఆయన చెబుతున్నారు.
జాతీయ ఇంధన పొదుపు ఫ్యాన్ల ద్వారా మంచి ఫలితాలను సాధించాలని కేంద్ర ఇంధన శాఖ భావిస్తోంది. ప్రఖ్యాత ఉషా, బజాజ్ సంస్థలు ఈ ఆధునిక స్మార్ట్ ఫ్యాన్లను తయారు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంధనాన్ని పొదుపు చేసే స్మార్ట్ ఫ్యాన్లను 60 రుపాయల నెలవారీ వాయిదా పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు లేదా ఒకేసారి రూ.1250 చెల్లించటం ద్వారా వీటిని స్వంతం చేసుకోవచ్చునని గోయల్ ప్రకటించారు. స్మార్ట్ ఫ్యాన్ల ద్వారా ప్రతి గృహస్థుడు సాలీనా ఏడు వందల రూపాయలను ఆదా చేయవచ్చునని ఆయన చెబుతున్నారు. భారతదేశంలో ఉన్న 77కోట్ల పాత తరం బల్బుల స్థానంలో విద్యుత్తును పొదుపు చేసే ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. దీనివలన ఇరవై వేల మెగావాట్ల విద్యుత్ లోడ్ తగ్గటంతోపాటు పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని గోయల్ తెలిపారు. ఎల్‌ఇడి బల్బులను ఏర్పాటు చేయటం వలన మొత్తం మీద నలభై వేల కోట్ల రూపాయలను ఆదా చేయగలుగుతామని ఆయన వివరించారు.
chitram...

కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్