జాతీయ వార్తలు

మహిళలపై ఆంక్షల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శనిసింగనాపూర్ ఆలయ ప్రవేశానికి అనుమతి దేవాలయ ట్రస్టు నిర్ణయం.. వెంటనే అమలు

మహిళల ప్రవేశంపై
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షలను శనిసింగనాపూర్ దేవాలయ ట్రస్టు శుక్రవారం
ఎత్తివేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర ఆరంభదినంగా జరుపుకునే ‘గుడి పడ్వా’ రోజునుంచే నిర్ణయం
అమలులోకి వచ్చింది.

అహ్మద్‌నగర్ (మహారాష్ట్ర), ఏప్రిల్ 8: దేవాలయాలలోకి ప్రవేశం విషయంలో లింగ వివక్షకు వ్యతిరేకంగా మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్థలు చేసిన ఆందోళన ఫలించింది. మహారాష్టల్రోని ప్రాచుర్యం పొందిన శని సింగనాపూర్ దేవాలయ గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆంక్షలను దేవాలయ ట్రస్టు శుక్రవారం ఎత్తివేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర ఆరంభ దినంగా జరుపుకునే ‘గుడి పాడ్వ’ రోజునుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. శనిసింగనాపూర్ దేవాలయ గర్భగుడిలోకి శుక్రవారం పురుషులతో పాటు మహిళా భక్తులను కూడా అనుమతించారు. హైకోర్టు తీర్పును దృష్టి లో పెట్టుకొని దేవాలయ గర్భగుడిలోకి పురుషులు, మహిళలు సహా భక్తులందరినీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించాలని శుక్రవారం జరిగిన ట్రస్టీల సమావేశంలో నిర్ణయించినట్లు సాయారామ్ బాంకర్ అనే ట్రస్టీ వెల్లడించారు. శనిదేవుడి ఆలయ గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఉల్లంఘించడానికి భూమాత బ్రిగేడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ దేవుడి దర్శనానికి వచ్చినా తాము ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. శనిదేవుడి ఆలయంలోకి ప్రవేశం విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ట్రస్టు నిర్ణయించిందని, శుక్రవారం ఆలయంలోని అన్ని ప్రదేశాలలోకి భక్తుల ప్రవేశానికి అనుమతించినట్లు దేవాలయ ట్రస్టు అధికార ప్రతినిధి హరిదాస్ గేవాలే చెప్పారు. అన్ని ప్రార్థనా స్థలాల్లోకి ప్రవేశించడం అనేది మహిళల ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముంబయి హైకోర్టు ఈ నెల ఒకటో తేదీన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మహిళలపై కొనసాగుతున్న ఆంక్షలు వివాదాస్పదం కావడంతో దేవాలయ ట్రస్టు గర్భగుడిలోకి పురుషుల ప్రవేశాన్ని కూడా తరువాత నిషేధించారు.
ఆలస్యమైనా.. సరైన నిర్ణయం: తృప్తి దేశాయ్
శని దేవాలయ గర్భగుడిలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడాన్ని భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ స్వాగతించారు. దేవాలయ ట్రస్టు ఆలస్యంగానయినా సరైన నిర్ణయం తీసుకుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రార్థనా స్థలాల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా తాము చేసిన దీర్ఘకాలిక పోరాటానికి లభించిన విజయమని ఆమె శుక్రవారం ఇక్కడ ఒక వార్తాసంస్థతో అన్నారు. దేవాలయ ట్రస్టీలు మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల తమకు సంతోషంగా ఉందన్నారు. తమ కార్యకర్తలతో కలిసి పూజలు చేయడానికి ఆమె పుణె నుంచి శనిశింగనాపూర్‌కు బయలుదేరారు. త్రయంబకేశ్వర్, నాసిక్‌లోని మహాలక్ష్మి దేవాలయంలో మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఆయా ట్రస్టీలు ఎత్తివేస్తాయన్న విశ్వాసాన్ని తృప్తి దేశాయ్ వ్యక్తం చేశారు.
‘గుడి పాడ్వ’ ప్రత్యేక పూజలు
అంతకుముందు శుక్రవారం ఉదయం ‘గుడి పాడ్వ’ను పురస్కరించుకొని శనిశింగనాపూర్ గ్రామానికి చెందిన సుమారు 250 మంది పురుషులు సుమారు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రవర సంగం నుంచి గోదావరి, మూలే నదుల నీరు తీసుకువచ్చి గర్భగుడిలోకి ప్రవేశించి, శని దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. పురుషుల ప్రవేశంపైనా ఇటీవల ఆంక్షలు అమలులోకి రావడంతో దేవాలయ అధికారులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే నూతన సంవత్సరం ఆరంభం రోజున సంప్రదాయంగా వస్తున్న ఈ పూజలను చేసి తీరుతామంటూ గ్రామస్తులు గర్భగుడిలోకి ప్రవేశించారు.
ఈ నేపథ్యంలో గర్భగుడిలోకి పూజారి మినహా ఒక్క పురుషుడు ప్రవేశించినా హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనంటూ తృప్తి దేశాయ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమావేశమైన దేవాలయ ట్రస్టు గర్భగుడిలోకి పురుషులు, మహిళలు సహా అందరికీ ప్రవేశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

చిత్రం... ఆలయ ప్రవేశం కల్పించడంతో పూజలు నిర్వహిస్తున్న భూమాత బ్రిగేడ్ స్వచ్ఛంద సంస్థ నాయకురాలు తృప్తి దేశాయ్