జాతీయ వార్తలు

లక్ష్మణ్‌కే బిజెపి పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా డాక్టర్ కె లక్ష్మణ్ నియమితులయ్యారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం ఐదు రాష్ట్రాల పార్టీ శాఖలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ప్రస్తుత అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్థానంలో బిజెపి శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ నియమితులయ్యారు. తెలంగాణ బిజెపి శాఖ అధ్యక్ష పదవికి ఆయనతో పాటు మరో రెండు పేర్లు పరిశీలనకు వచ్చినా బిజెపి అధినాయకత్వం చివరకు లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది.
లక్ష్మణ్ నాయకత్వంలో బిజెపి తెలంగాణలోని బలహీన వర్గాల్లోకి వెళ్తుందని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. తెలంగాణలో బిసిల జనాభా ఎక్కువ కాబట్టి వెనుకబడిన వర్గానికి చెందిన లక్ష్మణ్ పార్టీని బలోపేతం చేస్తారన్న విశ్వాసంతో అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా తెలంగాణతోపాటే ఆంధ్రప్రదేశ్‌కు కూడా కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. అయితే కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు జోక్యంతో ప్రస్తుతానికి ఆగిపోయినట్టు తెలిసింది. ఏపి బిజెపి శాఖ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును అధ్యక్షుడుగా నియమిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే వెంకయ్య దీన్ని గట్టిగా వ్యతిరేకించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన అభిప్రాయం మేరకే బిజెపి అధినాయకత్వం కూడా కొత్త అధ్యక్షుడిని నియమక ప్రతిపాదనను ప్రస్తుతానికి విరమించుకున్నట్టు తెలిసింది.