జాతీయ వార్తలు

నిట్‌లో ఆగని ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 8: శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (నిట్)లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిట్‌ను కాశ్మీర్ నుంచి మరోచోటికి తరలించడం సహా తమ డిమాండ్లన్నింటి సాధన కోసం స్థానికేతర విద్యార్థులు శుక్రవారం క్యాంపస్‌లో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలోని కొంతమంది విద్యార్థులు ఈ సందర్భంగా మెయిన్ గేట్ వైపునకు దూసుకెళ్లడానికి ప్రయత్నించగా క్యాంపస్‌లోపల విధి నిర్వహణలో ఉన్న భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. అయితే స్థానికేతర విద్యార్థులు చేస్తున్న డిమాండ్లలో చాలావాటిని స్థానిక విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా ఉన్నతాధికారులతో శ్రీనగర్ నిట్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. నిట్‌లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి తీసుకున్న చర్యలను హోంమంత్రికి వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, వివిధ నిఘా సంస్థల అధిపతులు, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శుక్రవారం స్థానికేతర విద్యార్థుల ప్రదర్శనలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు నిట్ ప్రధాన ద్వారం బయట ఉన్న మీడియాను కలవనివ్వాలని కోరారని అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారని, తరువాత ప్రధాన గేట్ నుంచి వెనుదిరిగి క్యాంపస్‌లోనికి వెళ్లిపోయారని అధికారులు చెప్పారు. నిట్‌ను కాశ్మీర్ నుంచి మరో చోటికి తరలించడంతో పాటు మంగళవారం లాఠీచార్జికి పాల్పడిన పోలీసులపై చర్య తీసుకోవాలని స్థానికేతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు నిట్ అధికారులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారిపైనా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ నెల 11నుంచి 14వరకు జరుగనున్న పరీక్షలను రాయదలచుకోలేని విద్యార్థులకు మరో అవకాశం ఇస్తామని నిట్ రిజిస్ట్రార్ కార్యాలయం గురువారం ప్రకటించింది.
స్థానికేతర విద్యార్థుల డిమాండ్లను స్థానిక విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. నిట్ క్యాంపస్‌లో కేంద్ర బలగాలను శాశ్వతంగా మోహరించి ఉంచాలన్న డిమాండ్‌ను వారు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల క్యాంపస్‌లో పరిస్థితి దయనీయంగా మారిపోతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన బృందానికి సమర్పించిన వినతిపత్రంలో వారు పేర్కొన్నారు. విద్యాసంస్థలో శాశ్వతంగా బలగాల మోహరింపు అంశం కాశ్మీర్‌లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఆమోదించేది కాదని వారు స్పష్టం చేశారు. గతంలో భద్రతా బలగాలు హాస్టళ్లలో ఉండేవని, దాని పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని గుర్తు చేశారు. 2008, 2010 సంవత్సరాలలో కాశ్మీర్ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు ఒక్క స్థానికేతర విద్యార్థికి కూడా హాని జరగలేదని గుర్తుచేశారు.

శ్రీనగర్‌లోని నిట్‌లో పోలీసులపైకి రాళ్లు రువ్వుతున్న విద్యార్థులు... ఆందోళనకారులపై బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తున్న పోలీసులు