జాతీయ వార్తలు

ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10:ఢిల్లీ, హిమాచల్, హర్యానా, జమ్ము,కాశ్మీర్ సహా ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలు భూ ప్రకంపనలకు గురయ్యాయి. అఫ్గానిస్తాన్‌లోని పర్వతమయ హిందుకుష్ కేంద్రంగా ఆదివారం రిక్టర్ స్కేలుపై 6.6 పాయింట్ల తీవ్రతతో భూకంపం సంభవించింది. భూ ఉపరితలానికి 210కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టుగా నిర్థారించారు. పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాలూ ప్రకంపనల తాకిడికి గురయ్యాయి. దక్షిణ గుజరాత్‌లోని నంద్వీ పట్టణం కేంద్రంగా 3.5పాయింట్ల తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. దీని ప్రభావం వల్ల దక్షిణ గుజరాత్‌లో సూరత్, తాపీ, రాజస్తాన్‌లోని జైపూర్, శ్రీగంగానగర్, బైకనేర్, చురు ప్రాంతాలూ ఊగిపోయాయి. ఢిల్లీలో భూ ప్రకంపనలకు బెంబేలెత్తిన ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. ఢిల్లీ సచివాలయంలోని ఆరో అంతస్తులో ఫర్నిచర్, ఇతర మొక్కలు ఊగిపోవడాన్ని తాను చూశానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా తెలిపారు. ప్రకంపనల కారణంగా కొద్ది సేపు మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు. భూకంపం వల్ల రాష్ట్రంలో ఎక్కడా ప్రాణ నష్టం లేదా ఆస్తినష్టం వాటిల్లినట్టుగా తమకు ఎలాంటి ఫోన్‌లురాలేదని అగ్ని మాపక విభాగం, పోలీసు అధికారులు తెలిపారు.

చిత్రం... భూ ప్రకంపనల అనంతరం శ్రీనగర్‌లో భయాందోళనలతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీసిన జనం