జాతీయ వార్తలు

అన్ని విధాలా ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాం, ఏప్రిల్ 10: పుట్టింగల్ ఆలయంలో సంభవించిన ప్రమాదాన్ని ఊహించశక్యం కానిదిగా పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్లిష్టసమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు అన్నివిధాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీ ప్రమాదం జరిగిన స్థలాన్ని, అనంతరం క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కొల్లాం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన అత్యంత బాధాకరం. ఈ దుర్ఘటన తీవ్రత ఊహకు అందనిది, భయానకమైనదని అన్నారు. ప్రధాని మోదీ కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో కూడా సమావేశమైనారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సాయం అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. గాయపడినవారిలో ఎవరినైనా ప్రత్యేక చికిత్సకోసం ముంబయి, ఢిల్లీ లేదా ఇతర నగరాలకు తరలించాలని అనుకుంటూ ఉంటే కేంద్రం అందుకు వెంటనే ఏర్పాట్లు చేస్తుందని తాను ముఖ్యమంత్రికి చెప్పానని ప్రధాని తెలిపారు. తమ ఆత్మీయులను కోల్పోయినవారికి ఆయన సంతాపం తెలియజేయడంతోపాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తిరువనంతపురం వెళ్లి అక్కడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరావమర్శించారు.
రాష్టప్రతి, పలువురు సిఎంల దిగ్భ్రాంతి
కేరళలో జరిగిన దుర్ఘటన దేశం యావత్తును కుదిపేసింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతోపాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ముఖ్యమంత్రులు తీవ్ర సంతాపం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సైతం కేరళ ఆలయం ప్రమాదంలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలని ఆమె కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీని కోరారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ సిఎం నితీశ్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ సైతం ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, సినీ నిర్మాత, దర్శకుడు శేఖర్ కపూర్, నటుడు జాన్ అబ్రహాం, నటి దియా మీర్జా, నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ తదితరులు సైతం సామాజిక మాధ్యమంలో ఈ దుర్ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆలయాలు, వేడుకల్లో ప్రమాదాలు జరగడం బాధాకరమని, ప్రమాదాలు జరక్కుండా ఇదొక గుణపాఠం కావాలని అభిప్రాయపడ్డారు.

కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో కలిసి ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని
సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ

జెడి(యు) అధ్యక్షుడిగా
నితీశ్ కుమార్ ఎన్నిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం జెడి(యు) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో బిహార్ నుంచి ఇతర రాష్ట్రాలకు పార్టీని విస్తరించి, 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని యోచిస్తున్న జెడి(యు)పై ఆయన పూర్తిగా పట్టు సాధించినట్లయింది. పదేళ్ల నుంచి జెడి(యు) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన శరద్ యాదవ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. ఆయన నాలుగోసారి ఆ పదవికి పోటీ చేసేందుకు నిరాకరించడంతో ఆదివారం జెడి(యు) జాతీయ కార్యవర్గం సమావేశమై నితీశ్ కుమార్‌ను పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నితీశ్ కుమార్‌ను జెడి(యు) నూతన అధ్యక్షుడిగా శరద్ యాదవ్ ప్రతిపాదించగా, పార్టీ సెక్రటరీ జనరల్ కెసి.త్యాగి, జనరల్ సెక్రటరీ జావెద్ రాజా తదితరులు బలపర్చారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ప్రస్తుతం బిహార్‌కు మాత్రమే పరిమితమైన జెడి(యు)కి ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఆ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించిన జార్జి ఫెర్నాండెజ్, శరద్ యాదవ్ బిహార్‌కు చెందినవారు కాదు.

పార్లమెంట్‌లో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పార్లమెంట్ భవనం రెండో అంతస్తులోని స్టోర్ సెక్షన్‌లో ఆదివారం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. 13 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని కేవలం 25 నిమిషాల్లోనే మంటలను ఆర్పేశాయి. మరో అంతస్తులో జెడి(యు) జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. అయినప్పటికీ ఈ సమావేశం నిరాటంకంగా కొనసాగిందని, షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు తెలిపారు.
‘ఆదివారం మధ్యాహ్నం దాదాపు 1.30 గంటల సమయంలో పార్లమెంట్ హాట్‌లైన్ నుంచి కాల్ రావడంతో ఆ విషయాన్ని అక్కడి ఆన్‌లైన్ అధికారి మాకు తెలియజేశారు. దీంతో హుటాహుటిన 13 అగ్నిమాపక శకటాలను అక్కడికి పంపించాం’ అని అగ్నిమాపకదళ అధికారి ఒకరు తెలిపారు. పార్లమెంట్ భవనం రెండో అంతస్తులో స్టోరుగా ఉపయోగిస్తున్న 219వ నెంబర్ గదిలో ఈ ప్రమాదం సంభవించిందని, అయితే ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా ఆర్పివేయడం జరిగిందని, నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని ఆయన చెప్పారు.