జాతీయ వార్తలు

ప్రాజెక్టులను గట్టెక్కించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మిషన్ కాకతీయలాంటి పథకాలకు మహత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పన హామీ పథకం నిధుల వాటాను 60 శాతానికి పెంచాలని కేంద్ర జలవనరుల శాఖ ఉపసంఘం సిఫారసు చేసినట్టు తెలంగాణ నీటిపారుదల మంత్రి, ఉపసంఘం సభ్యుడు హరీశ్‌రావు వెల్లడించారు. పిఎంకెఎస్‌వైలో పది తెలంగాణ నీటి ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యత జాబితాలో, ఒక ప్రాజెక్టు రెండో జాబితాలో చేర్చారన్నారు. వీటి నిర్మాణానికి తెలంగాణకు నాబార్డు, ఏఐబిపి నుంచి నాలుగు వేల కోట్ల గ్రాంట్లు, రుణాలు మంజూరు చేయాలని కోరామన్నారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర జలవనరుల ఉప సంఘం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరితగతిన పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు మే 15లోగా నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేశామన్నారు. ఆయా పథకాల పని తీరు, నిర్మాణ పురోగతి, నిధుల విడుదల, జిల్లా నీటిపారుదల పథకాల తయారీ అంశాల సమీక్షకు కేంద్ర జలసంఘం ప్రతీ నెలా రాష్ట్రాల ఇంజనీర్-ఇన్-చీఫ్‌లతో విధిగా సమావేశం జరపాలని సూచించామన్నారు. ప్రతి చిన్న అంశానికీ ఢిల్లీ కార్యాలయానికి పరుగులు తీయాల్సిన పని లేకుండా, కేంద్ర జల సంఘం ప్రాంతీయ కార్యాలయాలను పటిష్టపర్చి ప్రాంతీయ సమావేశాల్లోనే తగు నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అవసరమైతే ప్రాంతీయ కేంద్ర జలసంఘం సమావేశంల్లోనే ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారని హరీశ్‌రావు వెల్లడించారు. నాబార్డ్ నుంచి రాష్ట్రాల నీటిపారుదల ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేయాలని తాజా సమావేశంలో నిర్ణయించామన్నారు. 2012 నుంచీ మొదలైన ప్రాజెక్టులకు సంబంధించి గత నాలుగేళ్లలో పెరిగిన భారం, 40 శాతం నిధుల వాటాను రాష్ట్రాలు భరించలేని పరిస్థితిలో ఉంటే, ఆ ప్రాజెక్టులను రానున్న రెండేళ్లలో పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం గ్యారంటీతో నాబార్డ్ నుండి రుణం రూపంలో సమకూర్చాలని సిఫార్సు చేశామన్నారు. ఈ రుణాలు ఎఫ్‌ఆర్‌బిఎం రుణాలకు అదనమని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులను సకాలంలో నిర్మించినా, ఎక్కువ ఆయకట్టును సాధించినా రుణాలపై వడ్డీని కేంద్రం చెల్లించే ప్రోత్సాహక పథకాన్నీ అమలు చేయాలన్నారు. తెలంగాణకు సంబంధించిన పది నీటిపారుదల ప్రాజెక్టులను పిఎంకెఎస్‌వై పథకంలోని మొదటి ప్రాధాన్యత జాబితాలో చేర్చగా, ఒక ప్రాజెక్టును రెండో ప్రాధాన్యత జాబితాలో చేర్చినట్టు తెలిపారు. 11 ప్రాజెక్టులకు 1155 కోట్లు ఏఐబిపి నుంచి గ్రాంటురూపంలో, నాబార్డు నుంచి 2825 కోట్లు రుణం రూపంలో కావాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఉపసంఘం అన్ని నిర్ణయాలు తీసుకుంది, చేయాల్సిన సిఫార్సులు చేసింది. కాబట్టి మే 15లోగా తొలివిడత రుణాలు మంజూరు చేయాలని సిఫార్సు చేసినట్టు హరీశ్‌రావు వెల్లడించారు.