జాతీయ వార్తలు

పద్మ అవార్డులు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు మంగళవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. రాష్టప్రతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు. ఈనాడు సంస్థల అధినేత సిహెచ్ రామోజీరావు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బాహుబలి దర్శకుడు రాజవౌళి, ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎదిగిన నటి ప్రియాంకా చోప్రా, తెలుగుతో పాటు హిందీ భాష అభివృద్ధికి సేవలందిస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో పాటు మొత్తం 35 మందికి రాష్టప్రతి ప్రణబ్ అవార్డులు బహూకరించారు. రెండో విడత పద్మ అవార్డులు కార్యక్రమానికి ఎందరో అతిరథమహారధులు హాజరయ్యారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఐదుగురు ప్రముఖులకు పద్మ విభూషణ్, పది మందికి పద్మభూషణ్, 20 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పద్మ అవార్డుల కార్యక్రమానికి విచ్చేశారు. సిహెచ్ రామోజీరావుతోపాటు వాసుదేవ కలకంటే ఆత్రే, రజనీకాంత్, గిరిజాదేవి, శాంతా విశ్వనాథన్‌లకు రాష్టప్రతి పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రదానం చేశారు. పద్మభూషణ్ అవార్డును అందుకున్న ప్రముఖులు రవీంద్ర చంద్ర భార్గవ (ప్రజా వ్యవహారాలు), రాబర్ట్ డి బ్లాక్‌వెల్ (ప్రజా వ్యవహారాలు) ఇందుజైన్ (పారిశ్రామిక రంగం), ఉదిత్ నారాయణ (సినీ రంగం), సానియా మీర్జా (క్రీడారంగం), హెచ్. కన్నయ్యలాల్ (కళారంగం), యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (సాహిత్యం), స్వర్గీయ స్వామి దయానంద సరస్వతి (అధ్యాత్మికం), స్వామి దయానంద సరస్వతి అవార్డును ఆయన శిష్యుడు స్వామి శ్రద్దానంద సరస్వతి స్వీకరించారు. స్వామి తేజోమయానంద (ఆధ్యాత్మిక), రామ్ వి సుతర్ (శిల్పకళ), ప్రొఫెసర్ ఎన్‌ఎస్ రామానుజ తాతాచార్య (సాహిత్యం) పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ప్రముఖులు బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళి, ప్రియాంకా చోప్రా, ఎంఎం వెంకటేశ్‌కుమార్, మమతా చంద్రాకర్, సోను ఘోష్ (కళారంగం), డాక్టర్ మన్నం గోపీ చంద్, డాక్టర్ చంద్రశేఖర్ శేషాద్రి తొగులువా, డాక్టర్ అనీల్‌కుమార్ మల్హోత్రా, సుధీర్ వి షా(వైద్య రంగం), సునీతా కృష్ణన్ (సంఘసేవ), జైప్రకాశ్ లేఖివాల్ (చిత్రకళలు), బాలచంద్ర దత్తాత్రే మోందే (్ఫటోగ్రఫీ), రవీంద్ర నాజర్, దాహ్యాభాయి, కామేశ్వరం బ్రహ్మ, జవహర్‌లాల్ కౌల్,(విద్యారంగం), సైమన్ ఓరాన్ (పర్యావరణం), రవీందర్‌కుమార్ సిన్హా (వన్యప్రాణి సంరక్షణ), డాక్టర్ హెచ్‌ఆర్ నాగేంద్ర (యోగా), ఉజ్వల్ నికమ్ (ప్రజా వ్యవహారాలు).

రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మభూషణ్ సానియా మీర్జా (క్రీడారంగం)