జాతీయ వార్తలు

నిట్‌ను శ్రీనగర్‌నుంచి తరలించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (నిట్)ను శ్రీనగర్‌నుంచి మార్చే ప్రసక్తి లేదని జమ్మూ,కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి దేశ రాజధాని ఢిల్లీ వచ్చిన మెహబూబా అంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. కాగా, రాజ్‌నాథ్‌తో తన భేటీని ఆమె కేవలం మర్యాదపూర్వక భేటీగా అభివర్ణించారు. సింగ్‌తో దాదాపు 45 నిమిషాల సమావేశం తర్వాత బైటికి వచ్చిన మెహబూబా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోం మంత్రితో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెప్పారు. కాగా, సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు ఉగ్రవాదం కారణంగా రాష్ట్రంలో తలెత్తిన శాంతిభద్రతల పరిస్థితితోపాటుగా నిట్‌లో బయటి రాష్ట్రాల విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణల కారణంగా చోటుచేసుకున్న ఉద్రిక్తత గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, వీలయినంత త్వరలో నిట్‌లో మామూలు పరిస్థితులను నెలకొల్పాలని సమావేశం సందర్భంగా రాజ్‌నాథ్ ముఖ్యమంత్రికి చెప్పినట్లు హోం మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం నార్త్‌బ్లాక్‌నుంచి వెళ్తున్న సమయంలో విలేఖరులు నిట్‌లో తలెత్తిన ఉద్రిక్తత, క్యాంపస్‌ను జమ్మూకు మార్చాలన్న బయటి రాష్ట్రాల విద్యార్థుల డిమాండ్ గురించి అడిగారు. ఇది విద్యాసంస్థ లోపలి సమస్య మాత్రమేనని, దీనికి స్థానికులు, బైటివారు అనే రంగు పులమవద్దని ఆమె స్పష్టం చేశారు. బైటి రాష్ట్రాల విద్యార్థుల ఫిర్యాదులను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని ఆమె అంటూ, వీలయినంత త్వరలో సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక నిట్ క్యాంపస్‌ను వేరేచోటికి తరలించాలన్న కొంతమంది విద్యార్థుల డిమాండ్‌ను ప్రస్తావిస్తూ అది సాధ్యం కాదని మెహబూబా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా క్యాంపస్‌లో తలెత్తిన పరిస్థితిని సోమవారం సమీక్షించిన నిట్ పాలక మండలి వీలయినంత త్వరలో మామూలు పరిస్థితిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అభిప్రాయ పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మంగళవారం ఢిల్లీలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన మెహబూబా ముఫ్తీ

పులుల సంరక్షణ అందరి బాధ్యత
అంతర్జాతీయ సమాజం కలిసి రావాలన్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పెద్ద పులుల సంరక్షణకు అంతర్జాతీయ సమాజం కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం పిలుపునిచ్చారు. పులుల శరీర భాగాలను అక్రమంగా తరలించటాన్ని నిరోధించటానికి ప్రభుత్వాల మధ్య ఉన్నత స్థాయిలో సహకారం అవసరమని మోదీ అన్నారు. వన్యప్రాణులను రక్షించటానికి వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా నడుచుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. అడవులను, వన్యప్రాణులను వేరు చేసి చూడ జాలమని ఆయన పేర్కొన్నారు. ‘‘ఒక విధ్వంసం మరో విధ్వంసానికి దారి తీస్తుంది. వాతావరణంలో ప్రతికూల మార్పులకు ఇదొక ముఖ్య కారణం’’ అని పులుల సంరక్షణపై ఆసియా మంత్రుల మూడు రోజుల ప్రారంభ సదస్సులో మాట్లాడుతూ మోదీ అన్నారు.
శరీర భాగాలకు విశ్వవ్యాప్తంగా ఉన్న డిమాండ్ల కారణంగానే పులులకు ప్రమాదంగా మారిందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో దాదాపు ఏడు వందలమంది పులుల నిపుణులు, శాస్తవ్రేత్తలు, మేనేజర్లు, దాతలు, అధికారులు పాల్గొన్నారు.