అంతర్జాతీయం

నేపాల్‌లో బస్సు ప్రమాదం 24 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, ఏప్రిల్ 12: నేపాల్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. 31 మంది గాయపడ్డారు. ఖోతంగ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 300 మీటర్లలోతైన లోయలో పడిపోయింది. బర్ఖేతర్ గ్రామంలో రోడ్డుపక్కన ఉన్న లోయలోకి పల్టీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 24మంది మృతి చెందారు. అయితే బస్సు చెట్లు తుప్పల మధ్య ఇరుక్కుపోవడంతో ప్రయాణికులను రక్షించడానికి శ్రమించాల్సి వచ్చింది. పర్వత ప్రాంతం కావడంతో సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి కొన్ని గంటల సమయం తీసుకుంది. అతికష్టం మీద 17 పురుషుల, 7 మహిళల మృతదేహాలను వెలికితీశారు. గాయపడ్డ 31 మందిలో 23 మందిని వైద్య చికిత్స నిమిత్తం ఖాట్మండు తరలించారు. మిగిలినవారికి ప్రాథమిక చికిత్స అందజేశారు. బస్సు బయలుదేరే సమయంలో 28 మంది ప్రయాణికులే ఉండగా మార్గమధ్యంలో 40 మందికి పైగా ఎక్కారు. ఓవర్‌లోడ్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. కాగా నేపాల్ రహదారులన్నీ పర్వత ప్రాంతాల్లోనే ఉండడంతోపాటు ఇరుగ్గా ఉండడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. కండిషన్లో లేని వాహనాలను ప్రయాణికులు ఆశ్రయిస్తుంటారు.

భివాండీలో అగ్నిప్రమాదం
భవనంలో రెండు అంతస్తులు దగ్ధం
సురక్షితంగా బయటపడిన 170 మంది
థానే, ఏప్రిల్ 12: భివాండీ పట్టణంలోని నాలుగు అంతస్తుల నివాస భవనంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు అంతస్తులు దగ్ధమయ్యాయి. దీంతో ఆ భవనం పైకి చేరుకున్న దాదాపు 170 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ భవనం కింది అంతస్తులో నూలు, ఇతర ముడిసరుకులను నిల్వ చేసిన పవర్‌లూమ్ (మరమగ్గం) యూనిట్‌లో మంగళవారం ఉదయం 7 గంటలకు మంటలు చెలరేగి మొదటి అంతస్తుకు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించిందని భివాండీ తహశీల్దారు వైశాలి లంభాటే తెలిపారు. ఈ ప్రమాదం వలన కింది రెండు అంతస్తుల్లోని సైజింగ్ యూనిట్, సరకుల గోదాము పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని పైనగల రెండు అంతస్తులకు మంటలు వ్యాపించకుండా నిరోధించడంతో ప్రాణనష్టం తప్పిందని భివాండీ-నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ కంట్రోల్ సెల్ చీఫ్ నామ్‌దేవ్ గైక్వాడ్ వివరించారు.

రోహిత్ సోదరుడికి
ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగం!
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన దళిత స్కాలర్ రోహిత్ వేముల సోదరుడు రాజాకు ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది. కారుణ్యనియామకం కింద గుమస్తా ఉద్యోగం ఇవ్వడానికి అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సంసిద్ధత తెలిపింది. రాజా పాండిచ్ఛేరి సెంట్రల్ యూనివర్శిటీ నుంచి జియోలజీలో 72.8 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ సాధించాడు. రాజాకు లోయర్ డివిజన్ క్లర్క్, గ్రేడ్-4 స్థాయి జాబ్ ఇస్తారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంపై హెచ్‌సియు విద్యార్థులు, రోహిత్ వేముల స్నేహితులు మండిపడ్డారు. విద్యాధికుడైన రాజాకు కింద స్థాయి ఉద్యోగం కల్పించడం అవమానించమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజా ఉద్యోగంలో చేరాలా వద్దా అన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కారుణ్య నియామకం కింద కేవలం క్లరికల్ గ్రేడ్‌లోని సి, డి స్థాయి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని ఢిల్లీ అధికారులు స్పష్టం చేశారు. రాజా ఎమ్మెస్సీ పట్ట్భద్రుడే కాకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌ఇటి)లోనూ పాస్ అయ్యాడు.

లాతూర్ చేరిన
నీళ్ల రైలు
ముంబయి, ఏప్రిల్ 12: గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న మరాఠ్వాడా ప్రాంతంలోని లాతూర్‌కోసం అయిదు లక్షల లీటర్ల నీటిని తీసుకు వస్తున్న ప్రత్యేక రైలు 18 గంటల ప్రయాణించిన తర్వాత మంగళవారం ఉదయం తన గమ్యస్థానాన్ని చేరుకుంది. సోమవారం ఉదయం 11 గంటలకు పశ్చిమ మహారాష్టల్రోని మిరాజ్ స్టేషన్‌లో బయలుదేరిన ఈ ప్రత్యేక వాటర్ ట్రైన్ మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు లాతూర్ చేరుకుంది. 350 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి ఈ రైలుకు 18 గంటలు పట్టింది. ఒక్కోటి 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన పది ట్యాంకర్లను సాంగ్లి జిల్లాలోని మీరజ్ స్టేషన్‌లో నీటితో నింపడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన అధికారి ప్రతినిధి నరేంద్ర పాటిల్ చెప్పారు. ఈ నీటిని నిల్వ చేయడానికి అధికారులు లాతూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ పెద్ద బావిని సిద్ధం చేశారు. అక్కడినుంచి ఈ నీటిని ట్యాంకర్ల ద్వారా లాతూర్ పట్టణంలో పంపిణీ చేస్తారు. ఈ నెల 8న కోటా వర్క్‌షాపునుంచి పుణె డివిజన్‌లోని మిరాజ్‌కు బయలుదేరింది. 50 వ్యాగన్లతో కూడిన రెండో రైలు ఈ నెల 15 నాటికల్లా సిద్ధమవుతుంది.