జాతీయ వార్తలు

వణికిన మైన్మార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగన్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: మైన్మార్‌ను బుధవారం రాత్రి పెను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.9పాయింట్ల తీవ్రతతో సంభవించిన భూకంప తాకిడికి భారత్‌లోని అనేక రాష్ట్రాలు గురయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించక పోయినప్పటికీ ఈశాన్య భారతం, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు భూకంప ప్రభావానికి లోనయ్యాయి. ఈశాన్య భారత ప్రకంపనల ప్రభావం విశాఖ, శ్రీకాకుళంలోని అనేక ప్రాంతాల్లో కనించింది. బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్, ఆయన భార్య కేట్ బుధవారం సందర్శించిన అసోంలోని కజిరంగ ప్రాంతంలో కూడా ప్రకంపనల తీవ్రత కనిపించినట్టుగా చెబుతున్నారు. అమెరికా భౌగోళిక పరిశోధనా సంస్థ సమాచారం ప్రకారం మైన్మార్ రాజధాని నేపిడా సమీపంలో 135కిలోమీటర్ల మేర భూమిలోతుల్లో భూకంపం సంభవించినట్టు స్పష్టం అవుతోంది. మైన్మార్‌లో ప్రధాన పట్టణమైన యాంగన్‌లో భూకంప ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ప్రజలు తీవ్ర స్థాయిలో భయాందోళనలకు గురయ్యారని కథనాలు వెలువడ్డాయి. ఏడంతస్తుల భవనం రెండుసార్లు ఊగిపోవడాన్ని తాను చూశానని భూకపం సమయంలో యాంగన్‌లోని ఓ ఆసుపత్రిలో ఉన్న ఎపి వార్తా సంస్థ పాత్రికేయుడు తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న రోగులు, సిబ్బంది, సందర్శకులు ఒక్కసారిగా పరుగులు పెట్టారని తెలిపారు. భూమికి 135 కిలోమీటర్ల లోతుల్లో భూకంప కేంద్రం ఉండటం వల్ల దాని ప్రభావం సుదూర ప్రాంతాలపై కూడా ఉండే అవకాశం ఉంటుందని భారత జాతీయ భూకంప కేంద్రానికి చెందిన జె.ఎల్.గౌతం తెలిపారు. మైన్మార్ ప్రధాన భూకంపం తర్వాత మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో రిక్టర్ స్కేలుపై 4.6పాయింట్ల తీవ్రతతో రెండోసారీ భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర జిల్లాల్లోనే దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది.