జాతీయ వార్తలు

సమాచార శాఖ కార్యదర్శి సునీల్‌కు అరెస్టు వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: సమన్లు జారీ చేసినప్పటికీ గత సోమవారం తన ఎదుట హాజరు కానందుకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శి సునీల్ అరోరాపై బెయిలుకు అవకాశం ఉండే అరెస్టు వారెంటు జారీ చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ నెల 22న జరిగే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తదుపరి సమావేశానికి అరోరా హాజరు అయ్యేలా చూడడానికి సోమవారం ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ రిటైర్ట్ న్యాయమూర్తి సికె ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ కౌన్సిల్ కార్యకలాపాలు, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు కౌన్సిల్ జరుపుతున్న కృషి, అలాగే ప్రెస్ కౌన్సిల్ చట్టం కింద దానికి ఉన్న అధికారాల పట్ల సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై తనకు తానుగా విచారణ జరపాలని ప్రెస్ కౌన్సిల్ గత నెల 17న నిర్ణయించి, ఈ నెల 11న కౌన్సిల్ ఎదుట హాజరుకావాలని అరోరాను ఆదేశించింది. అరోరా ఈ నెల 30న రిటైరవుతున్నారు. కాగా, నోటీసులు అందుకోవడానికి తాను న్యూఢిల్లీలో లేనని, విదేశాల్లో ఉన్నానని, తాను తప్పకుండా కౌన్సిల్ ముందు హాజరవుతానని పేర్కొంటూ ఈ రోజు కౌన్సిల్‌కు అరోరానుంచి ఒక లేఖ అందినట్లు ప్రసాద్ చెప్పారు. తాను హాజరయ్యేందుకు వీలుగా తేదీలో మార్పు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని అరోరా కోరారు. కాగా అరోరా లేఖను కౌన్సిల్ పరిశీలిస్తున్నదని ప్రసాద్ చెప్పారు. వారెంట్ జారీని నిలిపివేయాలని కూడా కొంతమంది సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 11న అరోరా కౌన్సిల్ ముందు హాజరు కానందున వారెంట్‌ను జారీ చేయాలని, సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియజేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కౌన్సిల్ సభ్యుడొకరు చెప్పారు.