జాతీయ వార్తలు

ప్రమాదకరం.. జాతి వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అమెరికాతో మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న లాజిస్టిక్స్ సపోర్ట్ ఒప్పందం ఒప్పందం ప్రమాదకరమైనదని, భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి విఘాతమని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. ‘అమెరికాతో లాజిస్టిక్స్ సపోర్ట్ ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఎన్‌డిఎ ప్రభుత్వ నిర్ణయం భారతదేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి తిలోదకాలు ఇవ్వడమే’ అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందం ప్రమాదకరమైనదని, జాతి వ్యతిరేకమైనదని వామపక్షాలు విమర్శించాయి. ‘ఇది చాలా ప్రమాదకరమైన ఒప్పందం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఈ ఒప్పందంపై, ఇతర ఫౌండేషన్ ఒప్పందాలపై సంతకం చేయకూడదు’ అని యుపిఎ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎకె ఆంటోనీ బుధవారం ఇక్కడ ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు. ‘అమెరికాతో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రీమెంట్ (ఎల్‌ఇఎంఒఎ) కుదుర్చుకోవాలని ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకున్న సూత్రప్రాయ నిర్ణయం ప్రమాదకరమైనది. జాతి వ్యతిరేకమైనది’ అని వామపక్షాలు పేర్కొన్నాయి. మోదీ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ ఒప్పందంపై సంతకం చేయకూడదని వామపక్షాలు డిమాండ్ చేశాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, మోదీ ప్రభుత్వం ఈ లక్ష్మణ రేఖను దాటిందని విమర్శించాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్‌ను అమెరికాకు పూర్థిస్థాయి సైనిక మిత్రపక్షంగా మారుస్తోందని, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విషయంలో రాజీ పడుతోందని మండిపడ్డాయి. పార్లమెంటును కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా మోదీ ప్రభుత్వం అమెరికాను సంతృప్తి పరచడానికి ఇలాంటి కీలక నిర్ణయం ఎందుకు తీసుకుందని కమ్యూనిస్టు పార్టీలు నిలదీశాయి. ‘మోదీ ప్రభుత్వం ప్రమాదకరమైన చర్య తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ ప్రభుత్వం తీసుకోని చర్యను బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకుంది. భారత్‌ను అమెరికాకు పూర్తి స్థాయి సైనిక మిత్రపక్షంగా మారుస్తోంది’ అని సిపిఎం ఒక ప్రకటనలో ధ్వజమెత్తింది.