జాతీయ వార్తలు

అట్టుడుకుతున్న కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కాశ్మీర్‌లో ఆందోళనలు చల్లారకపోగా తాజాగా బుధవారం ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో మరో యువకుడు మృతి చెందడంతో పరిస్థితి మరింత దిగజారింది. మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లోని హంద్వారా పట్టణంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు, ఒక మహిళ మృతి చెందగా, మరో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలులో ఉండగా ముగ్గురి మృతికి నిరసనగా శ్రీనగర్‌కు సుమారు 95 కిలో మీటర్ల దూరంలోని దృగ్‌ముల్లాలో బుధవారం ఆందోళన చేస్తున్న ప్రజలను చెదరగొట్టడానికి భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించగా, అందులో ఒకటి జహంగీర్ అహ్మద్ వనీ అనే యువకుని తలకు తగలడంతో అతను మృతిచెందాడు. మరోవైపు, మంగళవారం నాటి కాల్పుల ఘటనపై ‘కాల పరిమితితో కూడిన విచారణ’ జరపాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రధాని నరేంద్ర మోదీని, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. మంగళవారం హంద్వారా పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమయ్యాడని పేర్కొంటూ జమ్మూకాశ్మీర్ పోలీస్‌కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను బుధవారం సస్పెండ్ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కాశ్మీర్ సిఎం మెహబూబా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో బుధవారం చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా హంద్వారా కాల్పుల ఘటనపై కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని, నియంత్రణ రేఖ వెంట మరిన్ని వాణిజ్య కేంద్రాలను తెరవాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి ఢిల్లీకి వచ్చిన మెహబూబా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన కార్యాలయంలో భేటీ అయిన మెహబూబా హంద్వారా ఘటనతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. అంతకుముందు మెహబూబా రక్షణ మంత్రి పారికర్‌తో భేటీ సందర్భంగా కాల పరిమితితో కూడిన విచారణ జరపడంతో పాటు ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, మంగళవారం నాటి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహిళ రాజా బేగం (55) చికిత్స పొందుతూ బుధవారం చెందింది. దీంతో హంద్వారా కాల్పుల్లో మృతుల సంఖ్య మూడుకు పెరగగా, దృగ్‌ముల్లాలో వనీ అనే యువకుడి మృతితో ఘర్షణల్లో మృతిచెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది.
chitram...
శ్రీనగర్‌లోని పాతబస్తీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న భద్రతా దళాలు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ