జాతీయ వార్తలు

పెరిగే జీతాల్లో చేతికి సగమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెరిగే తమ వేతనంలో కొంత భాగాన్ని ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణకోసం ఉపయోగించే ఓ నిధిలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించే ఓ పథకం రూపకల్పనకు ప్రభుత్వం యోచిస్తోంది. పన్ను మినహాయింపు లేదా అధిక రిటర్న్‌లులాంటి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా అధిక ఆదాయం వచ్చే ప్రభుత్వ అధికారులను ఈ నిధిలో పెట్టుబడి పెట్టేలా చేస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం సెక్షన్ ఆఫీసర్ ర్యాంక్‌నుంచి అధిక వేతనం లభించే అధికారులందరినీ పెరిగిన జీతంలో 50 శాతం బ్యాంక్ క్యాపిటలైజేషన్ బాండ్లలో పెట్టుబడి పెట్టాలని కోరుతారని అధికారులు తెలిపారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు గత వారం ప్రాథమిక చర్చలు జరిపారని, అయితే ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అధికారులు చెప్పారు. సెక్రటరీలతో కూడిన కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తోందని, పలు రకాల ప్రత్యామ్నాయలను సైతం ఆలోచిస్తున్నారని వారు చెప్పారు. నిరర్థక ఆస్తుల(ఎన్‌పిఏ) సుడిగుండంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరిన్ని మార్గాల కోసమే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. 2015 డిసెంబర్ నాటికి ప్రైవేట్ బ్యాంకుల్లో ఎన్‌పిఏలు రూ.39,859కోట్లు మాత్రమే ఉండగా పిఎస్‌యు బ్యాంకుల్లో ఇవి రూ.3.61 లక్షల కోట్లకు చేరుకున్న విషయం తెలిసిందే.