జాతీయ వార్తలు

శ్రీనగర్ నిట్‌లో చదువుకోలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: భయాందోళనల మధ్య తాము శ్రీనగర్ నిట్‌లో చదువుకోలేమని తెలుగు విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం శ్రీనగర్ నుంచి ఇక్కడికి చేరుకున్న విద్యార్థులు జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. శ్రీనగర్ నిట్‌లో తమకు రక్షణ లేదని, అక్కడ చదువుకోలేమని తెలిపారు. ఈ నిట్ కేంద్రాన్ని నిట్‌ను జమ్ముకు తరలించాలని, లేని పక్షంలో మరో క్యాంపస్‌కు మారేందుకు తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌లో ఉన్నంత వరకూ పోలీసు భద్రత ఉన్నప్పటికీ బయటకు వెళ్తే తమకు రక్షణ ఉండదని వాపోయారు. శ్రీనగర్ నుంచి వచ్చిన 33మంది తెలుగు విద్యార్థులకు ఆంధ్ర, తెలంగాణ భవన్‌లలో అన్ని ఏర్పాట్లు చేశారు.
భద్రత కల్పిస్తాం: మెహబూబా
నిట్ నుంచి వెనక్కి వెళ్లిన విద్యార్థులు తిరిగి రావాలని, అందరికీ భద్రత కల్పిస్తామని జమ్ము,కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో బుధవారం సమావేశమై నిట్ పరిస్థితి గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానికేతర విద్యార్థులందరికీ పూర్తి భద్రత కల్పిస్తామని, కాశ్మీర్ వారికి సొంతిల్లు లాంటిదన్నారు. నిట్‌లో చదువుతున్న విద్యార్థులను స్థానికేతరుల కోణంలో చూడకూడదన్నారు. శ్రీనగర్ ఎన్‌ఐటి విద్యార్థుల సమస్యల కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిశీలిస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు. హెచ్‌సియూ,జెఎన్‌యూ, ఎన్‌ఐటిలో జరిగిన ఘటనలు,పరిణామలు వాటి పరిష్కారం వంటి అంశాలు తమ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయన్నారు.