జాతీయ వార్తలు

నిప్పుల కొలిమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:యావద్భారతం మండిపోతోంది. చండప్రచండ వడగాడ్పులతో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత శుక్రవారం 40డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రత 42.2డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.నిన్నటి కంటే రెండు డిగ్రీల మేర ఎండలు పెరిగిపోవడంతో దేశ రాజధాని వాసులు బెంబేలెత్తిపోయారు. ఇప్పటికే ఒడిశాలో వడగాడ్పులకు 30మందికిపైగా మరణించినట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25కేంద్రాల్లో శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రత తీవ్రత 40డిగ్రీలు దాడిపోయిందని వాతావరణ విభాగం తెలిపింది. మధ్యప్రదేశ్, మహారాష్టల్రోని విదర్భ ప్రాంతం, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో గ్రీష్మతాపం నిప్పులు చెరుగుతోందని, 40 నుంచి 45డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో శుక్రవారం వడగాడ్పుల తీవ్రత పరాకాష్ఠకు చేరింది. వడదెబ్బ భయంతో జనం బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. విదర్భలోని వార్దాలో గరిష్ఠ స్థాయిలో 45డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైంది. 44డిగ్రీల సెల్సియస్‌తో చంద్రాపూర్ అట్టుడికింది. ఒడిశాలోని సోనేపూర్‌లో ఎండలు 45.8 డిగ్రీలకు చేరుకోవడంతో రాష్టమ్రంతా నిప్పుల కొలిమిగా మారింది. జైసెల్మేర్, కోట, జైపూర్ సహా రాజస్థాన్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఎండల తీవ్రత నమోదైంది.

చిత్రం... జూలో శుక్రవారం ఎండ వేడిమికి తాళలేక
నీటిలో సేదదీరుతున్న ఓ చిరుత