జాతీయ వార్తలు

చైనాను సాంస్కృతికంగా జయించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 15: రెండు వేల సంవత్సరాలకు పైగా చైనాపై భారత్ సాంస్కృతికంగా ఆధిపత్యం చెలాయించిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఒక్క సైనికుడ్ని కూడా పంపకుండా సముద్రా మార్గాల ద్వారానే ఈ ఘనతను భారత్ సాధించిందని మారిటైమ్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా రాజ్‌నాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఈ సదస్సులో మాట్లాడిన ఆయన గంగానదీ తలాలే నాగరిక ఆలోచనలకు పుట్టినిల్లని అన్నారు. దాదాపు 2వేల సంవత్సరాల పాటు సాంస్కృతికంగా చైనాను భారత్ నియంత్రించిందని నాటి పెకింగ్ వర్శిటీ వైస్ చాన్సలర్ హ్యూ షిహ్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసిన రాజ్‌నాథ్ సింగ్ ‘ఈ సందేశం చైనీయుల్లో బలంగా నాటుకుంది. సముద్ర మార్గాల ద్వారానే భారత్ ఈ ఘనతను సాధించిన విషయాన్ని గుర్తించింది’అని పేర్కొన్నారు. నాగరిక ఆలోచనలన్నీ గంగాతీరం నుంచే ఉద్భవించాయంటూ ఫ్రెంచి తత్వవేత్త వోల్టాయిర్‌ను ఉటంకిస్తూ రాజ్‌నాథ్ అన్నారు.
ఆర్థికంగా, సైనికపరంగా, సాంకేతికంగా కూడా భారత్ విస్తరిస్తున్న కొద్దీ దాని జాతీయ భద్రత, రాజకీయ ప్రయోజనాలు కూడా హిందు మహాసముద్ర తీరాల్ని సహజంగానే దాటతాయన్నారు. నౌక, తీర ప్రాంత రంగాల ద్వారా భారత స్థూలజాతీయోత్పత్తి మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఇది మూడు రెట్లు పెరగడం తధ్యమని తెలిపారు. సాగరమాల ప్రాజెక్టుకు రానున్న ఐదేళ్ల కాలంలో 66బిలియన్ డాలర్ల మేర పెట్టుబడుల్ని సేకరించాలన్న లక్ష్యాన్ని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సాధించగలదన్న ఆశాభావాన్ని రాజ్‌నాథ్ వ్యక్తం చేశారు.

మారిటైమ్ సదస్సులో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్