జాతీయ వార్తలు

అట్టుడికిన కుప్వారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 15: జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా శుక్రవారం ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఆందోళనకారులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. మృతి చెందిన విద్యార్థి 11వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఉత్తర కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది. తాజా ఘటన నేపథ్యంలో జనం రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు ఉద్ధృతం చేశారు. దక్షిణ కాశ్మీర్, శ్రీనగర్‌లోనూ నిరసనలు హోరెత్తిపోయాయి. అయితే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు సమాచారం లేదని మీడియా తెలిపింది. శుక్రవారం కుప్వారా దాని పరిసరాల్లో ఆందోళన కార్యక్రమాలు మిన్నంటాయి. ముఖ్యంగా కుప్వారా జిల్లా హంద్వారా పట్టణంలో గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. భద్రతా సిబ్బంది కాల్పుల్లో ముగ్గురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పట్టణంలో పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కాశ్మీర్ లోయలో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిషేధించారు. ఇప్పటికి ఘర్షణల వల్ల చనిపోయినవారి సంఖ్య ఐదుకు చేరుకుంది.

హంద్వారా ప్రాంతంలో నలుగురు వ్యక్తుల మరణానికి నిరసనగా ఆందోళనకు దిగిన తెహ్రీక్ ఎ-హురియత్ సభ్యులను తరిమికొడుతున్న జవానులు