జాతీయ వార్తలు

ఒక్కటై పోరాడితేనే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఏప్రిల్ 15: యుద్ధాల్లో తుది విజయం సాధించడానికి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి త్రివిధ దళాల మధ్య పూర్తి సమన్వయం అవసరమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు.
శుక్రవారం తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో ప్రతిష్ఠాత్మక డిఫెన్స్ సర్వీసెస్ స్ట్ఫా కాలేజిలో 71వ స్ట్ఫా కోర్స్ స్నాతకోత్సవంలో రాష్టప్రతి ప్రసంగిస్తూ, అలాంటి సమన్వయం కారణంగానే 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించడమేగాక బంగ్లాదేశ్ విముక్తి సాధ్యమయిందన్నారు. ‘ఏ దేశ శక్తికయినా సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలే ప్రధానమైనవి. ఈ మూడు ప్రధాన దళాల మధ్య పూర్తి సమన్వయం ద్వారా మాత్రమే విజయం సాధ్యమవుతుందని చరిత్రద్వారా మనకు రుజువవుతోంది. అలాంటి అద్భుతమైన సమన్వయం మిలిటరీ చరిత్రలో ప్రదర్శితమైంది 1971 యుద్ధంలోనే. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత అద్భుతమైన వ్యూహాత్మక విజయం లేదు. అందువల్లనే బంగ్లాదేశ్ విముక్తి పొందడమే కాకుండా ఒక దేశం ఆవిర్భావం జరగడం, యుద్ధం ముగియడం జరిగాయి’ అని రాష్టప్రతి అన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే విధంగా డిఫెన్స్ స్ట్ఫా కాలేజి పాఠ్య ప్రణాళికను సంస్థాగతం చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ రోజు కాలేజినుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో త్రివిధ దళాలకు చెందిన అధికారులతో పాటు 25 మిత్రదేశాలకు చెందిన 36 మంది అధికారులు కూడా ఉన్నారు. రాష్టప్రతి వారందరికీ మెడల్స్, చర్మపత్రాలను ప్రదానం చేశారు.
విజయవంతమైన మిలిటరీ ఆపరేషన్లకోసం వివిధ యుద్ధాల గురించి, ఆధునిక ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి బాగా తెలుసుకోవాలని రాష్టప్రతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వెళ్తున్న ఆఫీసర్లకు సూచించారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలను పరిరక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ అవగాహనను ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతారనేది మీ చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. ఇక్కడున్న రోజుల్లో తోటి అధికారులతో స్నేహం, సోదర బంధం పెంపొందించుకున్నందున ఈ రోజు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మిత్రదేశాలకు చెందిన అధికారులు భారత దేశంతో చిరకాల స్నేహబంధాన్ని కలిగి ఉంటారన్న ఆశాభావాన్ని రాష్టప్రతి వ్యక్తం చేశారు.

తమిళనాడులోని వెల్లింగ్టన్‌లో శుక్రవారం జరిగిన డిఫెన్స్ సర్వీసెస్ స్ట్ఫా కాలేజి 71వ స్ట్ఫా కోర్స్ స్నాతకోత్సవంలో
పాల్గొన్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ