జాతీయ వార్తలు

చౌకబారు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 17: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నా డిఎంకె ప్రభుత్వం, డిఎంకె పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని బిజెపి ఆదివారం ఆరోపించింది. ఈ రెండు ద్రవిడ పార్టీలు కూడా అవినీతితో నిండిన అసమర్థ పాలనను అందించాయని, ప్రజలను మోసం చేస్తున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తూ, అదే ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి తావులేని సుపరిపాలనను అందించారని పేర్కొంది. ‘మోదీజీ అవినీతికి తావు లేని సుపరిపాలనను అందించారు. అయితే తమిళనాడులో అన్నాడిఎంకె, డిఎంకెలు అవినీతితో నిండిన దుష్టపాలనను అందించాయి. ఆ పార్టీలు చౌకబారు రాజకీయాలు ఆడుతూ, జనాన్ని మోసం చేస్తున్నాయి’ అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే పథకానికి అమ్మ స్టిక్కర్లను అతికిస్తున్నందుకు అన్నాడిఎంకె ప్రభుత్వాన్ని ఆయన విమర్శిస్తూ, ‘పేదలకు ఉచిత బియ్యం ఇచ్చే పథకంలో 90 శాతం కేంద్రం సబ్సిడీ ఉంటే పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే అన్నా డిఎంకె ప్రభుత్వం దానికి ‘అమ్మ ఫ్రీ అరిసి’ (అమ్మ ఉచిత బియ్యం) పథకం అని పేరుపెట్టి లేబుళ్లు అతికిస్తున్నారు. కనీసం దానికి ప్రధానమంత్రి అరిసి అనయినా పేరుపెట్టమని మాత్రమే మేము అడుగుతున్నాం’ అని తమిళనాడు బిజెపి ఎన్నికల ఇన్‌చార్జి కూడా అయిన జవడేకర్ అన్నారు. ఉచిత బియ్యం పథకం కింద పేదలకు 20 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తారని చెప్తూ, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కిలోకు 32 రూపాయలు ఇస్తే అమ్మ (జయలలిత) మూడు రూపాయలు ఇస్తున్నారని, అయినా దానికి అమ్మ అరిసి పథకంగా ముద్ర వేసి స్టిక్కర్లు అతికిస్తున్నారని జవడేకర్ అన్నారు. అది అమ్మ అరిసి కాదని మోదీ అరిసి లేదా ప్రధానమంత్రి అరిసి అని పిలవవచ్చని ఆయన అన్నారు. తమకు పేర్లమోజు లేదని, అయినప్పటికీ పథకానికి ఇద్దరి పేర్లు పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. తమిళనాడులో కొబ్బరి పండించే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదని, అయితే పామాయిల్ పండించే మలేసియా రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని జవడేకర్ ఆరోపిస్తూ, కొబ్బరి నూనెకు సబ్సిడీ ఇస్తే అటు రైతు, ఇటు వినియోగదారుడు ఇద్దరూ సంతోషిస్తారన్నారు.