జాతీయ వార్తలు

చారిత్రక కట్టడాలకూ కాలుష్యం కాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఓ వైపు మానవ జీవితాలపై కాలుష్యం ప్రభావం అనేక దుష్పరిణామాలకు కారణమవుతూ ఉంటే చారిత్రిక కట్టడాలను సైతం అది వదిలిపెట్టడం లేదని, వాయు కాలుష్యం కారణంగా వాటిపై కూడా తీవ్ర దుష్ప్రభావం పడుతోందని నిపుణులు అంటున్నారు. చారిత్రక కట్టడాలు ముఖ్యంగా పాలరాతితో లేదా సున్నపు రాతితో నిర్మించిన కట్టడాలు కాలుష్యానికి గురయ్యాయనే దానికి స్పష్టమైన నిదర్శనమేమిటంటే ఆగ్రాలోని తాజ్‌మహల్ మాదిరిగా వాటి గోడలు క్రమంగా పసుపు రంగుకు మారడమేనని కూడా వారంటున్నారు. వాహనాలు, పరిశ్రమలనుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి కాలుష్యాలు గాలిలోని తేమతో కలిసి ఆమ్లాలుగా మారి పాలరాతిని తిని వేస్తాయని, ఫలితంగా అవి రంగు మారడమే కాక క్రమంగా నశించి పోతాయి. ఢిల్లీలో కాలుష్య ప్రభావానికి తాజాగా గురయిన కట్టడాల్లో లోటస్ టెంపుల్ ఒకటని, ట్రాఫిక్ సమస్యల మధ్య నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం వాహనాలనుంచి వెలువడే కర్బన ఉద్గారాల బారినపడుతూ చివరికి పసుపు రంగులోకి మారిపోయే ప్రమాదం ఉందని వారు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు బహాయ్ ఆలయాల్లో చివరిదైన దీన్ని గ్రీసులో పురాతన చారిత్రక కట్టడాలు నిర్మించడానికి ఉపయోగించిన పాలరాళ్లతో నిర్మించారు.
ప్రాథమిక దశలో చారిత్రక కట్టడాలకు ఎదురవుతున్న హానిని గుర్తించడానికి ఆ కట్టడం గోడపై తడి చేతిగుడ్డతో రుద్దితే చాలని ప్రముఖ విద్యావేత్త, కాలుష్యానికి వ్యతిరేక ఉద్యమకారుడు అయిన సోహైల్ హాష్మి అంటున్నారు. గోడనుంచి నల్లటి జిడ్డుతో కూడిన మురికి వస్తుందని, అది కేవలం దుమ్ము కాదని, వాహనాలనుంచి వెలువడే ఇంధన కాలుష్యాలు, ఫ్యాక్టరీలనుంచి వచ్చే గంధకం పొగలని ఆయన అంటున్నారు. వీటి కారణంగా గోడలకు పగుళ్లు వస్తాయని, యాసిడ్ వాటిలోకి చొచ్చుకుపోయి అకమంగా కట్టడం దెబ్బతింటుందని ఆయన చెప్పారు. 2010లో కామనె్వల్త్ గేమ్స్ సమయంలో తిరిగి నిర్మించిన ఎర్రకోటకు చెందిన పాలరాతి తలుపులు ఆరేళ్లలోనే పసుపురంగులోకి మారిపోయాయని కూడా ఆయన చెప్పారు.