జాతీయ వార్తలు

ఏం జరుగుతుందో 19న చూద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, డిసెంబర్ 11: నేషనల్ హెరాల్డ్ లాభార్జన కోసం పెట్టినది కాదని, అందులో నుంచి ఒక్క పైసా కూడా బయటకు రాజాలదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసును నడుపుతోంది ప్రధానమంత్రి కార్యాలయమేనని మరోసారి ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసు కక్ష సాధింపు రాజకీయాల ఫలితమేనా? అన్న విలేఖరుల ప్రశ్నకు స్పందిస్తూ రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. మేము దాన్ని గౌరవిస్తాం. నేషనల్ హెరాల్డ్ లాభార్జనకు ఉద్దేశించిన సంస్థ కాదు. అందులో నుంచి నయా పైసా బయటకు రాజాలదు’ అని రాహుల్ అన్నారు. మీరు బెయిల్‌కోసం దరఖాస్తు చేస్తారా? అని ప్రశ్నించగా, ‘డిసెంబర్ 19న ఏమి జరుగుతుందో చూద్దాం’ అని ఆయన బదులిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో డిసెంబర్ 19న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఢిల్లీ కోర్టు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతరులను ఈ నెల 8న ఆదేశించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ పనిచేయకుండా సాగుతున్న కాంగ్రెస్ సభ్యుల నిరసనలపై రాహుల్ మాట్లాడుతూ పార్లమెంట్ స్తంభనకు సంబంధించి జిఎస్‌టి బిల్లు పట్ల తమకు ఆసక్తి లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని, బిల్లులోని మూడు అంశాల పట్ల తమకు అభ్యంతరాలు ఉన్నాయని తాము ఎప్పుడో ప్రభుత్వానికి చెప్పామని వివరించారు. అసోంలో 2016లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. అసోంలో (ముఖ్యమంత్రి) తరుణ్ గొగోయ్, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బిహార్‌లో మేము ప్రత్యర్థులను ఓడించాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. బిహార్ తరహాలో అసోంలో కూడా కాంగ్రెస్ పార్టీ మహా కూటమిని ఏర్పాటు చేస్తుందా? అని ప్రశ్నించగా, ‘తరుణ్ గొగోయ్, అంజన్ దత్తా (ఎపిసిసి అధ్యక్షుడు) ఇన్‌చార్జీలు. వారు నిర్ణయిస్తారు’ అని రాహుల్ బదులిచ్చారు.