జాతీయ వార్తలు

ప్రత్యూష గర్భవతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: చిన్నారిపెళ్లికూతురు ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు రోజుకో కొత్త మలుపుతిరుగుతోంది. ఆత్మహత్య కేసుకునే నాటికే ప్రత్యూష గర్భవతి అని, ఆత్మహత్యకు ముందు ఆమె అబార్షన్ చేయించుందని రిపోర్టుల్లో వెల్లడైంది. ముంబయిలోని జెజె ఆసుపత్రి వైద్యుల కథనాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ విషయాలు తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందే ఆమె అబార్షన్ చేయించుకుందని జెజె ఆసుపత్రి వైద్యులే నిర్ధారించారు. అయితే గర్భందాల్చడానికి కారణం ఎవరన్నది మాత్రం డిఎన్‌ఏ పరీక్షలు చేసినా తెలుసుకోవడం కష్టమని వారు స్పష్టం చేశారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌లో దేశ వ్యాప్తంగా ఎందరో అభిమానాలను సంపాదించుకున్న ప్రత్యూష తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ప్రత్యూష ఆత్మహత్యకు బాయ్‌ఫ్రండ్ రాహుల్ రాజ్‌సింగ్ నిందితుడిగా ఉన్నాడు. తమ కుమార్తె ఆత్మహత్య కేసును క్రైమ్‌బ్రాంచ్ పోలీసులతో విచారణ జరిపించాలని ప్రత్యూష తల్లి ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. ఏప్రిల్ 1న గోరేగావ్‌లోని సొంత ఫ్లాట్‌లో ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.

వికలాంగ ఓటర్ల కోసం
బెంగాల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

కోల్‌కతా, ఏప్రిల్ 19: శాసనసభ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో వికలాంగ ఓటర్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పోలింగ్ బూత్‌ల వద్ద వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే వికలాంగులు పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా వీల్‌చైర్లు (చక్రాల కుర్చీలు), బ్రెయిలీ ఇవిఎంలను (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను) ఏర్పాటు చేశారు. శారీరక సమస్యలతో బాధపడే వికలాంగ ఓటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేయడంతో పాటు క్యూలో నిలబడకుండా వారు నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటుహక్కు వినియోగించునేలా చూడాలని అన్ని పోలింగ్ కేంద్రాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అమిత్‌జ్యోతి భట్టాచార్య తెలిపారు.