జాతీయ వార్తలు

జలసంరక్షణకు బృహత్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాబోయే రెండు నెలలు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఏ)కింద జలసంరక్షణ, నీటి నిల్వ కోసం భారీ ఎత్తున కృషి చేయడం జరుగుతుందని ప్రదాని నరేంద్ర మోదీ అంటూ, ఈ కృషిలో తమ వంతు తోడ్పాటునందించాలని ఎన్‌సిసి లాంటి అధికార యువజన సంస్థలను కోరారు. మంగళవారం ఇక్కడ ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎన్‌వైకెఎస్‌లాంటి అధికార యువజన సంస్థల పని తీరును ప్రధాని సమీక్షిస్తూ, ఈ సంస్థల మధ్య మరింత మెరుగైన సమన్వయం,సహకారం అవసరమని అన్నారు. ఈ సంస్థలు కీలకమైన పాత్ర పోషించగల తక్షణ రంగాల గురించి ప్రధాని మాట్లాడుతూ, రాబోయే రెండు నెలల్లో నీటి నిర్వహణ, నిల్వకు సంబంధించి పెద్దఎత్తున కృషి జరగనుందని చెప్పినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన కరవుతో అల్లాడుతున్న తరుణంలో నీటి సంరక్షణ, నిల్వకోసం పెద్ద ఎత్తున కృషి జరగనున్నట్లు ప్రధాని వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కృషిలో తమ వంతు పాత్ర పోషించడానికి వీలయింత ఎక్కువగా సమాయత్తం కావాలని ఈ సంస్థలను ప్రధాని కోరారు. వివిధ యువజన సంస్థల ప్రతినిదులు సమాజంలో తమ పాత్ర గురించి వివరించగా, ప్రధానమంత్రి పలు ఇతర వివరాలు,సూచనలు చేశారని ఆ ప్రకటన తెలిపింది. ముఖ్యంగా స్వచ్ఛత, బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలను తయారు చేయడం, యువకుల్లో నూతన జాతీయ స్ఫూర్తిని పాదుకోల్పడం లాంటివి యువజన సంస్థలు లక్ష్యాలుగా చేసుకోదగ్గ రంగాలని ఆయన సూచించారు. టీకాలు వేయని చిన్నారులందరికీ టీకాలు వేయడం కోసం చేపట్టిన ‘ఇంద్రధనుష్’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ యువజన సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు తోడ్పాటునందించవచ్చన్నారు. జనవరి 12న జాతీయ యువజనోత్సవం సందర్భంగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాల మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన అంటూ, అప్పుడే మరింత అర్థవంతమైన ప్రభావాన్ని సాధించగలుగుతామని అన్నారు. మరింత ప్రచారం పొందడానికి, యువకులతో మెరుగ్గా సంబంధాలు పెంచుకోవడానికి సోషల్ మీడియాలో మరింత చురుగ్గా పాలుపంచుకోవాలని కూడా అధికార యువజన సంస్థలకు ప్రధాని సలహా ఇచ్చారు.