జాతీయ వార్తలు

పెరిగిన బాలికల నిష్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ ఏప్రిల్ 19: బేటీ బచావో, బేటీ పడావో(కూతుర్ని రక్షించు, చదివించు) ప్రచార కార్యక్రమాన్ని మోదీ సర్కారు ప్రారంభించిన తరువాత దేశంలోని 49 జిల్లాల్లో బాలికల నిష్పత్తి పెరిగిందని కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటి వరకు దేశంలోని 100 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని.. అందులో 49జిల్లాల్లో సత్ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. దేశంలోని మరో 61 జిల్లాలో ఈ ప్రచార కార్యక్రమాన్ని ఆమె మంగళవారం ప్రారంభించారు. గ్రామ పంచాయితీల్లో గర్భిణీ స్ర్తిలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఆ గ్రామంలో నియమితులైన నోడల్ అధికారి గర్భిణీ స్ర్తిల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటం జరగాలని ఆమె అన్నారు. బాలబాలికల లింగ నిష్పత్తి ప్రతి ఏటా కనీసం పది పాయింట్లయినా పెరిగేలా చూడాలని జిల్లాల కలెక్టర్లను, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు సంబంధించి బాల, బాలికల జననాల సంఖ్యను నోటీసు బోర్డుల్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను మేనక కోరారు. ‘ఆసుపత్రుల్లో శిశువును చంపడం తేలికైన పని కాదు. ఇళ్లల్లో మంత్రసానుల ద్వారా అయ్యే కాన్పుల్లో ఈ పని చాలా సులువుగా చేయవచ్చు. అందుకే.. నూటికి నూరు శాతం కాన్పులు ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలి’ అని ఆమె స్పష్టం చేశారు.

బేటీ బచావో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు ఢిల్లీలో అందుకు సంబంధించిన ప్రదర్శనను తిలకిస్తున్న మేనకాగాంధీ