జాతీయ వార్తలు

ఎన్నికల తర్వాత బెంగాల్‌లో సిపిఎం తుడిచిపెట్టుకు పోతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగత్‌బల్లవ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 19: ప్రతిపక్షాలు తన గురించి, తన పార్టీ గురించి ఎంతగా దుష్ప్రచారం సాగిస్తే , రాబోయే అసెంబ్లీ ఎన్నిల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించడం అంతగా సులభమవుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. హౌరా జిల్లాలోని జగత్‌బల్లవ్‌పూర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడుతూ, వాళ్లుమనకు ఎంత చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తే, అంతగా తృణమూల్ కాంగ్రెస్ రాణిస్తుందని అన్నారు. తనపైన, తమ పార్టీపైన విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి, బిజెపిలను ఆమె దుయ్యబడ్తూ, ‘ఇలాంటి ఆరోపణలవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎన్నికల తర్వాత సిపిఎం తుడిచిపెట్టుకుపోతుంది, కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోతుంది. మత విభేదాలను సృష్టించే బిజెపి రాష్ట్రంవైపు కనె్నత్తి కూడా చూడలేదు’ అని అన్నారు. మనకు హితబోధ చేయడాని వాళ్లు ఎవరు? అని బిజెపినుద్దేశించి అంటూ వాళ్లు కేంద్రంలో తన ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిదన్నారు. వంద రోజుల పని, కన్యాశ్రీ పథకం, మరెన్నో పథకాల విషయంలో పశ్చిమ బెంగాల్ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని మమత అన్నారు. సిపిఎం హయాంలో ప్రభుత్వ ఖజానా ఖాళీ అయి ఉండిందని ఆమె అంటూ, తిరిగి రాష్ట్రాన్ని సర్వతోముఖ ప్రగతి పథంలోకి తీసుకురావడానికి గత అయిదేళ్లలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కాగా,స్టింగ్ ఆపరేషన్ టేపులు గనుక ముందు విడుదల చేసి ఉంటే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉండే దాన్నని గత ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మమత అన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలు, కొంతమంది రాష్టమ్రంత్రులు ఒక బూటకపు కంపెనీనుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నట్లు ‘నారదా న్యూస్’ అనే న్యూస్ పోర్టల్ విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలో వెల్లడైన విషయం తెలిసిందే, 2004నుంచి రెండు సంవత్సరాల పాటు తాము ఈ స్టింగ్ ఆపరేషన్‌ను జరిపినట్లు ఆ న్యూస్ పోర్టల్ చెప్పుకొంది.