జాతీయ వార్తలు

21వ శతాబ్దం భారత్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కత్రా, ఏప్రిల్ 19: తెలివితేటల యుగం అయిన 21వ శతాబ్దం భారత దేశందేనని, దేశ జనాభాలో 80 కోట్ల మంది యువకులు 35 ఏళ్లకన్నా తక్కువ వయసు వారయినందున ప్రతి యువకుడి కల ఈ దేశ ప్రగతి గాథ అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం జమ్మూ, కాశ్మీర్‌లోని కత్రా వద్ద మాతా వైహ్ణోదేవి యూనివర్శిటీ అయిదవ స్నాతకోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ, ఇది తెలివితేటలకు పెద్ద పీట వేసే శతాబ్ది అని, ఎప్పుడు తెలివితేటలకు పెద్దపీట వేసే రోజులున్నాసరే భారత దేశం ఇతరులకు మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు. ‘21వ శతాబ్దాన్ని భారత దేశం ఏలుతుంది. ఎందుకంటే 21వ శతాబ్దానికి అవసరమైన చోదక శక్తి తెలివితేటలు. అది భారత్ వద్ద పుష్కలంగా ఉంది. దేశం వద్ద 80 కోట్ల యువశక్తి ఉంది. ప్రతి యువకుడి కలా దేశానికి ఒక విజయగాథ అవుతుంది’ అని మోదీ అన్నారు. ‘తర్వాత ఏమిటి?’ అనే ప్రశ్న ప్రతి విద్యార్థి మదిలో మెదులుతూనే ఉంటుందని, అయితే భవిష్యత్తు గురించి అవగాహన ఉన్న వ్యక్తికి ఇతరుల సాయం అవసరం లేదని ఆయన అన్నారు. ‘మీ తల్లిదండ్రులు మీకోసం ఏం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ కోసం వాళ్లు తమ సంతోషాన్ని త్యాగం చేశారు. మీరు చిన్నతనంలో ఎన్నో ఆలోచించి ఉంటారు కానీ అవన్నీ నెరవేరి ఉండకపోవచ్చు. దాన్ని మరిచిపోయి మీరు ఏం సాధించారనే దానిగురించి ఆలోచించండి’ అని ఆయన అన్నారు. సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన పేద యాత్రికుల విరాళాలతో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధాని అం టూ, ‘మనమంతా కూడా పేదలకో సం ఏదైనా చేద్దామనే ప్రతిన బూను దాం’ అని అన్నారు. మనదేశం ప్రగతిలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని అంటూ, ఎవరిలాగానో అవుతామని కాక ఏదైనా సాధిద్దామని కలలు కనండని విద్యార్థులకు హిత వు పలికారు. దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్‌ను ప్రధాని గుర్తు చేస్తూ, ఈ యూనివర్శిటీకి శంకుస్థాపన చేసిన అబ్దుల్ కలాంకు మిసైల్ మ్యాన్‌గా కూడా పేరుందని, ఆయన ఒకప్పుడు పేపర్లు అమ్మే వారని అన్నారు. అలాగే బిహార్‌కు చెందిన దర్శన్ మంఝికి ఎలాంటి చదువు, సదుపాయాలు లేవని, అయితే ఆయనకు ఒక కల ఉండేదని, ఆయన ఒక్కరే రోడ్డు నిర్మించారని అన్నారు. కేవలం సదుపాయాలు ఉంటే సరిపోదని, అంకిత భావం కూడా అవసరమని మోదీ చెప్పారు. సదుపాయాలే సర్వస్వం అయి ఉంటే అలాంటి స దుపాయాలు ఉండే వారు జీవితంలో అన్నీ సాధించి ఉండేవారని అంటూ, అయితే అలా జరగడం లేదన్నారు. జమ్మూ, కాశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోరా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పలువురు కేంద్ర, రాష్టమ్రంత్రులు పాల్గొన్నారు.
citram.
కాశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి వర్శిటీ స్నాతకోత్సవంలో
మాట్లాడుతున్న ప్రధాని మోదీ