జాతీయ వార్తలు

బాధ్యత వీడి.. విమర్శలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కోర్టులపై భారం పెరిగిపోతున్నా.. కేసులు సంఖ్య అపరిమితంగా పేరుకు పోతున్నా న్యాయమూర్తుల సంఖ్యను పెంచకపోగా తమపై విమర్శలు గుప్పించడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ భావోద్వేగానికి లోనయ్యారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ లా కమిషన్ సిఫార్సులు చేసి మూడు దశాబ్దాలు గడిచినా ప్రభుత్వం ఏమీ చేయక పోవడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ‘మొత్తం భారాన్ని న్యాయవ్యవస్థపైనే వేయలేరు...ప్రభుత్వ పరంగా ఏదీ కదలదు’అంటూ గద్గద స్వరంతో తన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మూడు సందర్భాల్లో సిజె తన కన్నీళ్లను తుడుచుకపోవడం కనిపించింది. ఆయన ప్రసంగాన్ని ప్రధాని మోదీ తదేకంగా వింటూండటం కనిపించింది. ఆదివారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ఆయన మాట్లాడుతూ న్యాయం జరగటంలో జరుగుతున్న అసాధారణ జాప్యంపై వస్తున్న విమర్శలు ఎంతమాత్రం సమంజసం కావని తేల్చిచెప్పారు. ప్రస్తుత సమస్యలకు దీనికి న్యాయవ్యవస్థది మాత్రమే బాధ్యత కాదని..ప్రభుత్వం పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. అవసరమైన సంఖ్యలో న్యాయమూర్తులను భర్తీ చేయకుండా, కేసుల పరిష్కారం సాధ్యం కాదన్నారు. కేవలం విమర్శలతో కాలక్షేపం చేయకుండా వాస్తవానుగుణంగా చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి దోహదం చేయాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమస్యల తీవ్రత పట్ల భావోద్వేగానికి లోనుకావడం తన బలహీనత అని అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్న ఠాకూర్ ‘జస్టీస్ కేహర్ (కొత్త సిజెఐగా నియమితమయ్యే అవకాశం ఉన్న వ్యక్తి) గట్టి మనిషి..్భవోద్వేగానికి లోనుకారు’అని అన్నారు.
ఈ సదస్సులో సీజే చేసిన ఆసక్తి కల వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
- న్యాయవ్యవస్థను ఏకపక్షంగా విమర్శించటం సరికాదు. కేవలం న్యాయవ్యవస్థపైనే మొత్తం భారం వేయజాలరు. మిగతా దేశాల న్యాయమూర్తుల పనితీరుతో పోలిస్తే మన న్యాయమూర్తులు చాలా ఎత్తులో ఉన్నారు.
- గతంలోనూ ఉపన్యాసాలు చెప్పారు. సదస్సుల్లో ప్రసంగాలు చేశారు. పార్లమెంటులో కూడా చర్చలు జరిగాయి. కాని నిజంగా కార్యాచరణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
- కేంద్రమేమో మేం చేయాల్సింది చేశాం.. ఇక తరువాతి బాధ్యత రాష్ట్రాలదే అని అంటుంది. రాష్ట్రాలేమో.. కేంద్రం మాకు తగినన్ని నిధులు ఇవ్వాలంటాయి. ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. జడ్జిల సంఖ్య మారదు.. 38లక్షల కేసులు ఎక్కడివక్కడే పెండింగ్‌లో ఉంటాయి.
- 1987లోనే న్యాయ కమిషన్ 10లక్షల మందికి 10 మంది న్యాయమూర్తులు కాకుండా 50మంది న్యాయమూర్తులు ఉండాలని సిఫారసు చేసింది. ఇప్పుడున్న 21వేల మంది జడ్జిల సంఖ్యను 40వేలకు పెంచాలన్న సిఫారసుకు మోక్షం లేదు.
- 1987నుంచి మన జనాభా 25కోట్లు పెరిగింది. వేగంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి అయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మనం ఆహ్వానిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. అయినా న్యాయవ్యవస్థ పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడి మాదిరిగానే ఉంది.
chitram...
సదస్సు వేదికపై సిజె ఠాకూర్, ప్రధాని మోదీ, న్యాయమంత్రి గౌడ