అంతర్జాతీయం

ఒబామానే శాసించిన బ్రిటీష్ రాణి ఎలిజబెత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 24: ప్రపంచానే్న శాసించే స్థితిలో ఉండే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బ్రిటీష్ రాణి ఎలిజబెత్ ఆదేశాలకు తలొగ్గక తప్పలేదు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ 90వ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన విందులో పాల్గొనడం కోసం ఒబామా దంపతులు ఆమె విండ్సర్ కాజిల్ ప్యాలెస్‌కు వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఒబామాతో పాటుగా ఆయన భద్రతా సిబ్బందితో కలిసి మొత్తం ఆరు హెలికాప్టర్లు విండ్సర్ క్యాజిల్ ప్యాలెస్ లాన్స్‌లో దిగాలని అమెరికా సీక్రెట్ సర్వీస్ మొదట నిర్ణయించింది.
అయితే ఎలిజబెత్ రాణి మాత్రం మూడు హెలికాప్టర్లు మాత్రమే లాన్స్‌లో దిగడానికి అనుమతిస్తామని అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు స్పష్టంగా చెప్పినట్లు రాణివాసం వర్గాలు తెలిపాయి. మొదట్లో అమెరికా సీక్రెట్ సర్వీస్ అందుకు అంగీకరించక పోయినప్పటికీ చివరికి ఆమె అదేశాలను పాటించక తప్పలేదని ఆ వర్గాలు తెలిపాయి. 2011లో ఒబామా బ్రిటన్ పర్యటన సమయంలో ఆయన హెలికాప్టర్లు విండ్స ర్ క్యాజిల్ లాన్స్‌ను నాశనం చేసిన కారణంగానే రాణి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆ వర్గాలు తెలిపాయని ది డెయిలీ ఎక్స్‌ప్రెస్2 పత్రిక తెలిపింది.

విండ్‌సర్ లాన్స్‌లో ఒబామాకు స్వాగతం
పలుకుతున్న బ్రిటీష్ రాణి ఎలిజిబెత్