జాతీయ వార్తలు

ఆర్టికల్ 356.. అధికార పార్టీల బ్రహ్మాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీపై ఓ వైపు కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలన్నీ ముప్పేట దాడి చేస్తుం టే మరోవైపు ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం కారణంగా 356 అధికరణాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని వాదిస్తూ వస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ 356 అధికరణం అనేది అధికార పార్టీలకు బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతోందనేది నిర్వివాదాంశం. 1951నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 111 సార్లు రాష్టప్రతి పాలనను విధించడానికి ఈ అధికరణాన్ని ఉపయోగించుకున్నాయని గణాంకాలు చెపుతున్నా యి. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని ప్రస్తుత ప్రధాని మోదీ హయాం దాకా రాష్టప్రతి పాలన విధింపునకు సంబంధించిన గణాంకాలు ఇవి. అత్యధికంగా 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో 45 సార్లు రాష్టప్రతి పాలనను విధిస్తే మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో పదిసార్లు మాత్రమే విధించడం గమనార్హం. కాగా, అయిదేళ్లకన్నా తక్కువ కాలం కొనసాగిన పివి నరసింహారావు పాలనలో 11 సార్లు విధించగా నెహ్రూ పాలనలో ఏడు సార్లు విధించారు. రాజీవ్ గాంధీ పాలన లో ఆరు సార్లు, లాల్ బహదూర్ శాస్ర్తీ పాలనలో రెండు సార్లు రాష్టప్రతి పాలన విధించారు. చివరికి జనతా పార్టీ, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల సమయంలో కూడా రాష్ట్రాల్లో రాష్టప్రతి పాలనను విధించడం జరిగింది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉండిన సమయంలో 12 సార్లు, విపి సింగ్ ప్రధానిగా ఉండిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు విధించారు. చరణ్ సింగ్, చంద్రశేఖర్‌ప్రభుత్వా ల్లో నాలుగేసి సార్లు, దేవెగౌడ పాలనలో రెండుసార్లు రాష్టప్రతి పాలన విధించడం జరిగింది. వాజపేయి ప్రధానిగా ఉండిన ఆరేళ్ల సమయంలో కేవలం నాలుగు సార్లే రాష్టప్రతి పాలన విధించగా, మోదీ ప్రధానిగా ఉండిన ఈ రెండేళ్ల కాలంలో రెండు సార్లుమాత్రమే విధించారని బిజెపి వర్గాలు అంటున్నాయి.