జాతీయ వార్తలు

మీ బాధ తెలుసు.. భారం తీరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచటం ద్వారా న్యాయవ్యవస్థపై పెరుగుతున్న భారాన్ని తగ్గించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కోర్టులపై పెరిగిపోతున్న భారాన్ని ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ భావోద్వేగానికి లోనైన నేపథ్యంలో మాట్లాడిన మోదీ 3క్లోజ్డ్ డోర్..క్లోజ్ టీం విధానం2 ఆచరిస్తే సమస్యకు ఒక మార్గం కనుగొనేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వీలుంటే ప్రభుత్వానికి చెందిన కొందరు, కోర్టు సూచించే కొందరు వ్యక్తులు ఒక గదిలో కూర్చోని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించవచ్చునని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించిన సమస్యలను విని ఏమీ చేయకుండా వెళ్లిపోయే నాయకుడిని కాదని ఆయన స్పష్టం చేశారు. తాను గతంలో ఒక సారి కోర్టుల పని వేళలను పెంచాలన్నప్పుడు, కోర్లు సెలవులను తగ్గించాలని ప్రతిపాదించినప్పుడు చాలా మంది తనపై మండి పడ్డారని మోదీ గుర్తు చేశారు. సమస్యలున్న మాట వాస్తవం, వాటిని పరిష్కరించేందుకు మనమంతా కలి సి ప్రయత్నించాలని ప్రధాన మంత్రి చెప్పారు. వాస్తవానికి ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించిన అనంతరం మాట్లాడాల్సి ఉంది. అయితే ప్రధాన న్యాయమూర్తి ఠాకుర్ అకస్మికంగా కంట తడి పెట్టటంతో నరేంద్ర మోదీ అప్పటికప్పడే స్పందించవలసి వచ్చింది. న్యాయమూర్తుల నియామకం అంశంపై సుప్రీం కోర్టు వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గొడవ కొనసాగటం తెలిసిందే. కొలీజియం వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకం జరుగుతుండగా ఇది మంచి విధానం కాదంటూ ప్రభుత్వం ఒక నియామక కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఈ కమిటీ విధానాన్ని సుప్రీం కోర్టు గట్టిగా వ్యతిరేకించింది. కొలీజియం వ్యవస్థను పునరుద్దరించటం తెలిసిందే. ఇది జరిగినప్పటి నుండి సుప్రీం కోర్టుకు ప్రభుత్వానికి మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగటం లేదు. ఉమ్మడి సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ మోదీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనగలవనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ, చట్టాలలో ఉన్న అతి పునాతన విధానాలను తొలగించేందుకు ఎన్.డి.ఏ ప్రభుత్వం చేస్తు న్న కృషిని ఆయన వివరించారు. దేశ ప్రజలకు న్యాయ వ్యవ స్థ పట్ల అచంచల విశ్వాసం ఉన్నదని, ఇది అతి పెద్ద ఆస్తి అని అన్నారు. కాలం చెల్లిన చట్టాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొన్న మోదీ భోపాల్‌లో ఇటీవల జరిగిన న్యాయమూర్తుల సదస్సు, అందులో చర్చించిన అంశాల గురించి కూడా ప్రస్తావించారు. ఇలాంటి సదస్సుల వలన ఎంతో మేలు జరుగుందన్నారు. దేశంలోని సగటు మనిషికి న్యాయ వ్యవస్థపై ఎంతో విశ్వాసం ఉందని, దీన్ని పరిరక్షించుకునేందుకు ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం కూడా ఈ లక్ష్య సాధనకు తీవ్రంగా కృషి చేస్తుంది, బాధ్యతలను నిర్వర్తిస్తుందని హామీ ఇచ్చారు. 1987లో తీసుకున్న నిర్ణయాలు ఇంత వరకు అమలు కాకపోవటం పట్ల ఆయన ఆదోళన వ్యక్తం చేశారు. కనీసం ఇప్పుడైనా ఈ సమస్యను పరిష్కరించుకునేందురకు కృషి చేయాలన్నారు. చట్టా లు తయారు చేసేటప్పుడు ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని పేర్కొన్న ప్రధాని అవి స్పష్టంగా ఉండాలని, ఎలాంటి సందేహాలకు తావివ్వకూడనివిగా ఉండాలని తెలిపారు.

ఆదివారం ఢిల్లీలో జరిగిన హైకోర్టుల సిజెలు, రాష్ట్రాల సిఎంల సదస్సులో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్