జాతీయ వార్తలు

కప్పదాటు కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తేనే ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు బలపడతాయని పాకిస్తాన్‌కు భారత్ తెగేసి చెప్పింది. ఇరు దేశాల శాంతిని కబళిస్తున్న ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో రెండోమాటకు తావేలేదని స్పష్టం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన విదేశాంగ కార్యదర్శుల సమావేశంలో ఉగ్రవాదం, పఠాన్‌కోట్ తదితర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్, పాక్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్‌ల మధ్య దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలు, వాటిపై ఉగ్రవాద ప్రభావ తీవ్రతను భారత్ చాలా సూటిగానే పాక్‌కు తెలిపింది. దీనిపై కప్పదాటు చందంగా వ్యవహరించ వద్దని, కఠినంగానే వ్యవహరించాలని తెలిపింది. అయితే పాక్ విదేశాంగ కార్యదర్శి మాత్రం కాశ్మీర్ పరిష్కారంపై పట్టుబట్టారు. ఇరు దేశాల సంబంధాల్లో ఇదే కీలక అంశమంటూ పాతపాటే పాడారు. హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఐజాజ్ భారత విదేశాంగ కార్యదర్శితో సమావేశమయ్యారు. భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్ అంశాన్ని, అలాగే ముంబయిపై దాడి, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల దర్యాప్తు అంశాన్ని కూడా భారత్ ఈ సందర్భంగా చాలా గట్టిగానే ప్రస్తావించింది. జాదవ్‌ను కిడ్నాప్ చేసి పాకిస్తాన్‌కు తీసుకెళ్లారని భారత్ స్పష్టం చేయడం గమనార్హం. పఠాన్‌కోట్ దాడికి సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేయాలని, ముంబయి దాడి కేసు పరిష్కారం విషయంలోనూ ఇంకెంత మాత్రం తాత్సారం కుదరదని జయశంకర్ డిమాండ్ చేశారు. కాగా, తాము కూడా భారత్ గూఢచారి సంస్థ ‘రా’చేపడుతున్న విచ్ఛిన్నకర కార్యకలాపాల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించామని ప్రకటనలో పాకిస్తాన్ స్పష్టం చేసింది.