జాతీయ వార్తలు

మోదీ షేక్‌హ్యాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: రాజ్యసభలో బుధవారం ఉల్లాసభరిత వాతావరణం చోటు చేసుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి కొత్తగా ఎంపికైన సభ్యులు, ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అధికార, విపక్ష నేతల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంది. రాజ్యసభ కార్యక్రమాలు ప్రారంభం కావటానికి కొద్ది నిమిషాల ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో విపక్ష సభ్యులు కూర్చునే సీట్లవైపు వెళ్లి అందరితో చేతులు కలుపుతూ పేరుపేరునా పలకరించారు. కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటో నీ, ఆనంద్ శర్మ, ప్రమోద్ తివారీ, బీ ఎస్పీ అధినేత్రి మాయావతి, ఆ పార్టీ నేత సతీశ్ మిశ్రాలను ముందుగా పలకరించారు. ఆ తరువాత బీజేడీ నేత దిలిప్ కుమా ర్ టికే, తృణమూల్ కాంగ్రెస్ నేత సుఖేందు శేఖర్ రాయ్, వామ పక్ష నేతలు సీతా రాం ఏచూరి, టీకే రంగరాజన్‌లను వారి స్థానాల వద్దకు వెళ్లి పలకరించారు. సభ ప్రా రంభం అయిన వెంటనే రాజ్యసభలో సభానాయకుడు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పక్కన తనకు కేటాయించినట్లో కూచున్నారు. సభ ప్రారంభం అయిన వెంటనే అయిదుగురు కొత్త సభ్యులు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా, స్వపన్‌దాస్ గుప్తా, సుబ్రమణియన్ స్వామి, ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ ఎంసి మేరే కోమ్, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు నరేంద్ర జాదవ్‌లు ప్రమాణస్వీకారం చేశారు.