జాతీయ వార్తలు

దొందూ దొందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 26: ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. గత ప్రభుత్వాలను ఆడిపోసుకోవడం ఇద్దరు నేతలకు అలవాటుగా మారిందని మంగళవారం ఆమె నిప్పులు చెరిగారు. చన్నింగ్‌లో ఎన్నికల సభలో మాట్లాడిన సోనియాగాంధీ‘గత ప్రభుత్వాలపై బురదచల్లడమే తప్ప వీరద్దరూ ప్రజలకు చేసిందేమీలేదు’అని ధ్వజమెత్తారు. మోదీ, మమతల వల్ల పశ్చిమబెంగాల్ నష్టమే తప్ప ప్రయోజనం లేదని కాంగ్రెస్ అధినేత్రి ఆరోపించారు. పాలకపక్షాల తీరు వల్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని ఆమె దుయ్యబట్టారు.‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వౌలిక సూత్రాలకే విరుద్ధంగా పనిచేస్తోంది. లౌకికవాదం మంటగలుస్తోంది. ప్రజాస్వామ్యం, దేశ ప్రతిష్టకు తీరని నష్టం వాటిల్లుతోంది’అని సోనియా నిప్పులు చెరిగారు. మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు శుష్కవాగ్ధానాలు చేస్తూ కాలం గడుపుతోందని ఆమె విమర్శించారు.‘ఐదేళ్ల క్రితం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి మీ ఓట్లు దండుకుంది. ఇప్పుడు భయభ్రాంతులను చేసి ఓట్లు కాజేయడానికి ప్రయతిస్తోంది’అని తృణమూల్‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ అరచేతిలో వైకుంఠం చూపుతూ జనన్నా భ్రమల్లో ఉంచుతున్నారని ఆమె అన్నారు. 60 ఏళ్లు కాంగ్రెస్ దేశానికి ఏమీ చేయలేదని మోదీ చెబుతున్నారని, రెండేళ్ల పాలనలో ఆయన ఏమి చేశారో ప్రజలు అర్థం చేసుకున్నారని సోనియా ఎద్దేవా చేశారు. రాజ్యాగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం పటిష్టానికి పాటుపడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని సోనియా స్పష్టం చేశారు. శాంతి, సోదర భావం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. సోనియాతోపాటు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి సభలో ప్రసంగించారు.