జాతీయ వార్తలు

అవినీతి నిజమే.. త్యాగి పాత్ర ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు 2010లో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని స్పష్టంగా కనిపిస్తోందని, భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్‌పి త్యాగికి ఈ కుంభకోణంతో సంబం ధం ఉందని ఇటలీకి చెందిన మిలన్ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీస్ తన 225 పేజిల తీర్పులో పేర్కొంది. కోర్టు ఇచ్చిన తీర్పులో త్యాగి అవినీతిపై తాను ఒక నిర్ణయానికి రావడానికి కారణాలేమిటో పేర్కొంటూ 17 పేజిల ప్రత్యేక అధ్యాయం ఒకటి ఉందని ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రిక తెలిపింది. 10-15 మిలియన్ డాలర్ల అక్రమ నిధుల్లో కొంత భాగం భారతీయ అధికారులకు వెళ్లినట్లు కూడా స్పష్టంగా రుజువైందని కూడా కోర్టు పేర్కొంది. ప్రముఖులు ప్రయాణించడం కోసం కొనుగోలు చేసిన ఈ హెలికాప్టర్ల ఒప్పందం కుదిరిన సమయం అంటే 2005-07 మధ్య కాలంలో త్యాగి భారత వైమానిక దళం చీఫ్‌గా ఉన్నారు. అయితే తాను ఎలాంటి తప్పూ చేయలేదని త్యాగి వాదించారు. కాగా, కోట్లాది రూపాయల ఈ కుంభకోణంలో వాస్తవాలను వెలికి తీయడం పట్ల యుపిఏ ప్రనుత్వం పెద్దగా ఆసక్తి చూపించలేదంటూ ఇటలీ కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించినట్లు వార్తలు రావడంతో సోమవారం బిజెపి లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తింది కూడా. జీరో అవర్‌లో బిజెపి ఎంపి మీనాక్షి లేఖి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రూ. 3565 కోట్ల రూపాయల విలువైన అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని అన్నారు. 2013 ఏప్రిల్‌లో ఇటలీ మన దేశాన్ని ఈ కేసుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను అందజేయాలని కోరిందని, అయితే ప్రభుత్వం మూడు డాక్యుమెంట్లను అది కూడా 2014లో సమర్పించిందని ఆమె అంటూ, దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని, దీనిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. తాను ఈ విషయాన్ని రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు సభ్యురాలికి హామీ ఇచ్చారు.

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది
జగన్‌పై టిడిపి ఎంపీలు ధ్వజం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై టిడిపి ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన రాజధాని అమరావతి నిర్మించడం ప్రతిపక్ష నాయకుడి జగన్‌కు ఇష్టం లేకనే అవినితీ ఆరోపణలు చేస్తున్నరని టీడీపీ ఎంపిలు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబుమీద జగన్ అవినితీ ఆరోపణలు చేస్తూ పుస్తకం విడుదల చేయ్యడం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు’ ఉందని ఎంపీలు అన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ పుస్తకంలో చేసిన ఆరోపణలను నిరూపించాలని టిడిపి ఎంపీలు సవాల్ విసిరారు. ఏపీ నూతన రాజధాని అమరావతి భూసేకరణ విషయంలో జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎంపీలు మండిపడ్డారు. రాష్ట్భ్రావృద్ధిని జగన్ అన్ని విధాలుగా అడ్డుకొంటున్నారని వారు ఆరోపించారు. జగన్ చేసిన అవినితి వల్ల ఉన్నత అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలు పాలయ్యారన్నారు. రోజురోజుకి వైకాపా గ్రాఫ్ ప్రజల్లో పడిపోతోందని, జగన్ ఒంటెత్తు పోకడ మూలంగానే వైకాపాను వీడి టిడిపిలోకి చేరుతన్నారని ఎంపీలు చేప్పారు. రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములు కావడానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికే వైకాపా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని ఎంపీలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఆ పార్టీ ఎంపీలు తోట నర్సిహం, కె రామ్మోహన్ నాయుడు, పండుల రవీంద్రబాబు, గల్లా జయదేవ్, కె నారాయణ, రాయపాటి సాంబశివరావు,శ్రీరాం మాల్యాద్రి, మాగంటి బాబు,కేశినేని నాని పాల్గొన్నారు.

బిచ్చగత్తెగా
మారిన హీరోయిన్
ముంబై, ఏప్రిల్ 26: సినిమా రంగుల ప్రపంచంలో స్టార్‌గా ఎదగాలని వచ్చిన ఓ అమ్మాయి.. మతి చలించి, ముంబై వీధుల్లో బిచ్చగత్తెగా మారింది. రెండురోజుల పాటు తిండి లేక మలమల మాడిపోతున్న కడుపు నింపుకోవటానికి దొంగతనం చేయబోయి పోలీసులకు చిక్కింది. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ ముంబైలోని ఓషివారాలోని ఓ హౌసింగ్ సొసైటీ దగ్గర పార్క్ చేసి ఉన్న ఓ కారు అద్దాలను పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కింది.
పోలీసులు ఆమెను అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పుడు వారిని తోసి, రక్కి పారిపోవటానికి ప్రయత్నించినా చివరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మిథాలీ శర్మను విచారించినప్పుడు తాను ఓ భోజ్‌పురి సినిమాలో నటించినట్లు పేర్కొంది.