జాతీయ వార్తలు

ఇక కత్తెరలొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: సినిమాలకు కత్తెర వేసే కంటే వాటిని పెద్దలు, పిల్లల సినిమాలుగా వర్గీకరించాలని శ్యాం బెనెగల్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. కొత్త తరహాలో సినిమాల వర్గీకరణ విధానాన్ని అమలులోకి తేవాలని తెలిపింది. ఇందులో భాగంగా మొత్తం నాలుగు విభాగాలుగా సినిమాలు విభజించింది. వీటిలో మొదటిది వన్ ప్లస్ 12కాగా రెండోది వన్ ప్లస్ 15 ఉండాలని స్పష్టం చేసింది. పెద్దల సినిమాలను కూడా రెండుగా విభజించాలని సూచించింది.
వీటిలో మొదటిది మామూలు పెద్దల సినిమా, రెండోది ‘హెచ్చరిక‘తో ముడివడిన పెద్దల సినిమాగా విడుదల చేయాలని తెలిపింది. తాము ప్రభుత్వానికి చేసిన సిఫార్సుల వివరాలను ప్యానల్ అధ్యక్షుడు శ్యాం బెనెగల్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ ప్యానల్‌లో బెనెగల్‌తో పాటు కమల్ హసన్, ఓ ప్రకాశ్ మెహ్రా,పియూష్ పాండే, భావనా సౌమ్యతో పాటు సమాచార, ప్రసార శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు.
ఢిల్లీలో మంగళవారం కేంద్రమంత్రి జైట్లీతో భేటీ అయన శ్యాం బెనగల్