జాతీయ వార్తలు

తేలని ఉత్తరాఖండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27:ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ, రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి బుధవారం కొత్త మలుపు తిరిగాయి. ఉత్తరాఖండ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై తాము తీర్పు వెలువరించే వరకూ రాష్టప్రతి పాలన కొనసాగుతుందని తాజా రూలింగ్‌లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే శుక్రవారం జరగాల్సిన హరీశ్ రావత్ బలపరీక్షపైనా స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం మొత్తం ఏడు కఠిన ప్రశ్నలను సంధించింది. అంతే కాదు, ప్రభుత్వం సమాధానానికి వీలుగా ఇతర ప్రశ్నలనూ ఇందులో చేర్చవచ్చునని అటార్నీ జనరల్‌కు స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది. వచ్చే నెల్లో కోర్టు వేసవి సెలవులు ప్రారంభమయ్యే లోగానే ఉత్తరాఖండ్ వ్యవహారం తేలిపోతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను మరికొన్ని రోజులు పొడిగిస్తూ సుప్రీం కోర్టు బెంచి తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకించడం లేదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రావత్ తరపు న్యాయవాది మను సింఘ్వీ తెలిపారు. ఈ మొత్తం సమస్యకు అసెంబ్లీలో బలపరీక్ష జరగడమే తుది పరిష్కారమని విచారణ సందర్భంగా స్పష్టం చేసిన న్యాయమూర్తులు తాము వేసిన ప్రశ్నలు, చేసిన సూచనలను పరిశీలించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీని కోరారు. ఈ అంశం చాలా తీవ్రమైన స్వభావాన్ని కలిగి ఉన్నదని..అయితే ప్రాధమికంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తమకు ఉందని తెలిపారు. రాష్టప్రతి పాలన విధింపు నిర్ణయం సహేతుకం కాదని తాము భావించే పక్షంలో అసెంబ్లీలో బల పరీక్షకు రంగం సిద్ధం చేయడమే తదుపరి చర్య అవుతుందని కూడా న్యాయమూర్తులు సంకేత ప్రాయంగా తెలిపారు. ఈ అంశంపై కేంద్రం, కాంగ్రెస్ పార్టీల మధ్య వాదోపవాదాలు వచ్చే నెల మూడున మళ్లీ మొదలై ఆరోతేదీన ముగుస్తాయి.

వీటికి జవాబివ్వండి

బలపరీక్ష జాప్యమైనంత మాత్రాన రాష్టప్రతి పాలనకు కారణం దొరికినట్టేనా?
కొందరు ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటిస్తే రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రయోగానికి సహేతుక
వాతావరణం ఏర్పడినట్టేనా?
కేంద్ర పాలన విధించడానికి అసెంబ్లీలో జరిగే పరిణామాలను రాష్టప్రతి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందా?
అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణకు సంబంధించి రాజ్యాంగంలోని 175(2) అధికరణ కింద గవర్నర్ ఉత్తర్వును పంపించి ఉండాల్సిందా?
గవర్నర్, స్పీకర్ రాజ్యాంగ పదవులు కాబట్టి.. అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను గవర్నర్
కోరగలుగుతారా?
ద్రవ్య బిల్లు విఫలమైతే ప్రభుత్వం పతనమవుతుంది. అయితే స్పీకర్ ఏమీ చెప్పనప్పుడు ద్రవ్య బిల్లు సభ ఆమోదం పొందలేదని చెప్పేదెవరు?
రాష్టప్రతి పాలన విధించే సమయంలో ద్రవ్య వినిమయ బిల్లు
ఏ స్థితిలో ఉంది?