జాతీయ వార్తలు

ఫోర్బ్స్‌లో ప్రభాస్, రాజవౌళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఈ ఏడు అధిక ఆదాయాన్ని ఆర్జించిన సెలబ్రిటీలలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తిరిగి అగ్ర స్థానాన్ని ఆక్రమించారు. ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్‌ను షారుక్ రెండో స్థానంలోకి నెట్టివేశారని ఫోర్బ్స్ తన వార్షిక ఇండియా సెలబ్రిటీ లిస్ట్- 2015లో పేర్కొంది. షారుక్ ఖాన్ ఈ ఏటి అంచనా ఆదాయం రూ. 257.5 కోట్లుగా పేర్కొంది. అధిక ఆదాయం గల వంద మంది సెలబ్రిటీల జాబితాలో ఈసారి 14మంది కొత్తగా చేరారు. వీరిలో క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (31వ స్థానం), సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి, సినీ హీరో ప్రభాస్ ఉన్నారు. బాహుబలి చిత్రం భారీ హిట్ సాధించడంతో వీరిద్దరు ఫోర్బ్స్ జాబితాలో చేరారు. గత సంవత్సరంతో పోలిస్తే కొంత మంది తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకొని ఈ ఏటి జాబితాలో బాగా పైకి ఎగబాకారు. ఇలా బాగా ఎదిగిన పై ముగ్గురిలో ధనుష్, క్రికెటర్ రోహిత్ శర్మ, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఉన్నారు. ధనుష్ 41 స్థానాలను ఎగబాకి 37వ ర్యాంకులో నిలిచారు. రోహిత్, అల్లు అర్జున్‌లు 38 స్థానాలను ఎగబాకి ప్రస్తుతం వరుసగా 12, 42వ ర్యాంకుల్లో నిలిచారు. కాగా, సంజయ్ లీలా భన్సాలీ, ఎ.ఆర్ మురుగదాస్, శంకర్ ఎహ్‌సాన్ లాయ్ సహా 19 మంది సెలబ్రిటీలు ఈసారి ఫోర్బ్స్ రూపొందించిన వంది మంది జాబితాలో చోటు కోల్పోయారు.