జాతీయ వార్తలు

బెంగాల్ ఎన్నికల్లో 244మంది కోటీశ్వరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 3: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో 244మంది కోటీశ్వరులు పోటీ పడుతున్నారని ఓ సర్వేలో తేలింది. మొత్తం 1961మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వారిలో 244మంది కోటీశ్వరులని.. వీరిలో 114మంది అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని ఆసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశే్లషణ చేసింది. రెండోస్థానంలో 44మంది కోటీశ్వరులతో బీజేపీ ఉందని.. కాంగ్రెస్ 32, స్వతంత్రులు 19, సీపీ ఎం 13, బీ ఎస్పీ 4, ఆరెస్పీ 2, ఏఐఎఫ్‌బీ 2, మరో 11మంది ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నారని ఏడీ ఆర్ సర్వే పేర్కొంది. 2011 ఎన్నికల నాటి నుంచి ఇప్పటికి ఎన్నికల బరిలో కోటీశ్వరుల సంఖ్య ఏకంగా 112 శాతం పెరిగిందని వివరించింది. 2011లో సగటున రూ.60.11లక్షల ఆస్తి ఉన్న 245మంది ఎమ్మెల్యేల ఆస్తి 2016 నాటికి రూ. 1.27కోట్లకు చేరుకుందని సరేవ్లో వెల్లడించారు. కస్బా ఎమ్మెల్యే, విపత్తు నిర్వహణ మంత్రి జవేబ్ ఖాన్ ఆస్తి రూ.2.16 కోట్ల నుంచి ఏకంగా రూ.17.29 కోట్లకు చేరుకుందని వివరించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఆస్తులు రూ.7.08కోట్ల నుంచి రూ.11.74కు పెరిగాయి. ధనియాఖలి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న టీ ఎంసీ ఎమ్మెల్యే అసీమా పాత్ర ఆస్తులైతే 2011 నుంచి 2016 నాటికి ఏకంగా 3185శాతం పెరిగింది.
294అభ్యర్థులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని సర్వేలో పేర్కొన్నారు. వీరిలో 76 టీ ఎంసీ అభ్యర్థులు కాగా, 52మంది బీజేపీ నుంచి, 47మంది టీ ఎంసీ నుంచి, 31 మంది కాంగ్రెస్ వాళ్లున్నారన్నారు.
వాతావరణంపై ‘కార్బన్-12’
చిత్రాల ద్వారా ఉద్యమిస్తున్న కళాకారులు
న్యూఢిల్లీ, మే 3: వాతావరణంపై వస్తున్న మార్పులపై పెయింటింగ్‌ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు 12మంది ప్రపంచ ప్రసిద్ధ కళాకారులు ఏకమయ్యారు. హరిత వాయువుల ఉద్గారాలకు ప్రధానకారణమైన కార్బన్ ప్రభావాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని వేసిన చిత్రాలతో రెండు రోజుల ప్రదర్శన (కార్బన్-12) మంగళవారం ప్రారంభమైంది. భూమికి, మనిషికి ఉన్న సంబంధం.. కార్బన్ ప్రభావంతో పర్యావరణంలో వచ్చే మార్పులపై చిత్రాలను ప్రదర్శించారు. ఈ పెయింటింగ్‌లలో ‘ది సన్’ అన్న ఆర్ట్ వర్క్ ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం సూర్యుడు తన వాస్తవ రూపాన్ని కోల్పోయి. బాధతో, కోపంతో ఆక్రోశిస్తున్న వైనాన్ని అద్భుతంగా ప్రతిఫలింపజేస్తోంది. ఈ ఎగ్జిబిషన్ రాబోయే ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరిక లాంటిదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇక్కడి పెయింటింగ్‌లు అన్నీ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సమష్టి స్ఫూర్తి, సంకల్పం, చర్యలతోనే వాతావరణానికి ఏర్పడే ముప్పును ఎదుర్కోగలమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వాతావరణం కలుషితం కావటానికి మానవ ప్రమేయమే కారణమైనప్పుడు.. అదే మానవ ప్రమేయం వాతావరణ సానుకూల కోణంలో ముందుకు సాగితే ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవటం కష్టం కాదని జవదేకర్ వ్యాఖ్యానించారు.