జాతీయ వార్తలు

బలపరీక్ష సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 3: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో తన పర్యవేక్షణలో బలపరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయేమో పరిశీలించి తనకు తెలియజేయాలని సుప్రీంకోర్టు మంగళవారం అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసుకున్న అపీల్‌పై విచారణను సుప్రీంకోర్టు బుధవారం దాకా వాయిదా వేసింది. కేంద్రం పిటిషన్‌పై విచారణను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సమయం నిర్ణయించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన బెంచ్ జస్టిస్ సింగ్ మధ్యాహ్నం 2 గంటలకు మెడికల్ ఎంట్రన్స్ కేసు విచారణను చేపట్టే మరో బెంచ్‌లో సభ్యుడుగా ఉన్నందున ఈ అంశాన్ని ఈ రోజు చేపట్టలేమని సంబంధిత కక్షిదారులకు తెలియజేయడం కోసం ఉదయం పదిన్నర గంటలకే ఈ అంశాన్ని విచారణకు చేపట్టింది. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం కోసం తన పర్యవేక్షణలో అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలన్న తన సూచనను కొద్ది సేపు జరిగిన విచారణ సందర్భంగా బెంచ్ ఒకటికి రెండు సార్లు పునరుద్ఘాటించింది. ఈ అంశానికి సంబంధించి తననుంచి ఆదేశాలు తీసుకుని సాధ్యాసాద్యాల గురించి రేపు(బుధవారం) తెలియజేయాలని బెంచ్ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని ఆదేశించింది.రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను కొట్టివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును గత నెల 22న 27 దాకా నిలిపివేసిన సుప్రీంకోర్టు ఆ తర్వాత రాష్ట్రంలో రాష్టప్రతిపాలనను పునరుద్ధరించి రాష్ట్రంలో రాజకీయ నాటకానికి కొత్త మలుపునిచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, కేంద్రానికి కొన్ని ప్రశ్నలను కూడా సంధించింది. గత నెల 27న సుప్రీంకోర్టు స్టేను పొడిగిస్తూ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నల జాబితాలోకి మరికొన్ని ఇతర ప్రశ్నలను చేర్చడానికి అటార్నీ జనరల్‌కు స్వేచ్ఛను ఇచ్చింది.