జాతీయ వార్తలు

నాగాలాండ్ కొత్త సిఎం లీజిట్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహిమా, ఫిబ్రవరి 22: నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా షుర్‌తోజెలీ లీజిట్సు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ పిబి ఆచార్య రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. 81 ఏళ్ల లీజిట్సుతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త ముఖ్యమంత్రి ప్రస్తుతం నాగాలాండ్ విధానసభలో సభ్యుడు కారు. సిఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలలోగా ఆయన విధానసభకు ఎన్నిక కావలసి ఉంటుంది. గతంలో అసెంబ్లీకి ఎనిమిదిసార్లు ఎన్నికయిన లీజిట్సు 2013 ఎన్నికల్లో పోటీ చేయలేదు. బుధవారం ప్రమాణస్వీకారం చేసిన మంత్రులలో కియానిలీ పెసెయి, యంతుంగో పట్టన్, పి.లోంగాన్, సి.కిపిలి సంగ్టమ్, సిఎల్ జాన్, యిటాచు, పైవాంగ్ కొన్యక్, విఖెహో స్వు, చోటిసు సాజో, ఇంకోంగ్ ఎల్ ఇంచెన్, జి.కైటో అయె ఉన్నారు. ఈ 11 మందిలో ఇంకోంగ్ ఎల్ ఇంచెన్, జి.కైటో అయె ఈసారి కొత్తగా మంత్రివర్గంలో చేరారు. అధికార డెమొక్రటిక్ అలయెన్స్ ఆఫ్ నాగాలాండ్ (డిఎఎన్)కు చెందిన 59 మంది ఎమ్మెల్యేలు సోమవారం లీజిట్సును ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్య 60. నాగా పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షుడు, అధికార డిఎఎన్ చైర్మన్ అయిన లీజిట్సు.. టిఆర్ జెలియాంగ్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రి అయ్యారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో 33 శాతం సీట్లను మహిళలకు రిజర్వు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ గిరిజన సంస్థలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో జెలియాంగ్ ఆదివారం ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.