శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఆర్టీసీకి రూ. 3వేల కోట్ల నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 28: రాష్ట్ర విభజనతో తమ సంస్థ ప్రస్తుతం రూ.3వేల కోట్ల నష్టాల ఊబిలో కూరుకుని అత్యంత గడ్డు దుస్థితిని ఎదుర్కొంటుందని ఏపిఎస్ ఆర్టీసీ నెల్లూరు జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రవీంద్రబాబు వాపోయారు. రూ.2.4వేల కోట్ల వరకు వివిధ రూపాల్లో రుణాలను సేకరించి నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన ఏడు మాసాల్లో రూ. 444 కోట్ల వరకు నష్టం వెంటాడుతుందన్నారు. మొత్తమీద ప్రతి కార్మికుని నెత్తిపై సంస్థ భారం తలసరి 5లక్షల వరకు ఉందని గణాంకాల్ని వివరించారు. ఇలాంటి స్థితి నుంచి ఉపశమన దిశగా వస్తుసేవల్ని రవాణా చేసే కార్గో వ్యవస్థ ఆశాకిరణం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. నష్టాల్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలనైనా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా, 2015-16 ఆర్థిక సంవత్సరంలో తగిన రెవెన్యూ సాధిస్తూ కిలోమీటర్ పర్ లీటర్ (కెఎంపిఎల్)లో సత్తా చాటినందుకు ఆత్మకూరు డిపో యంత్రాంగాన్ని కొనియాడారు. రాష్ట్రంలోని 127 డిపోల్లో ఉత్తమ కెఎంపిఎల్ సాధించిన పదింటా ఆత్మకూరు కూడా ఒకటిగా ఉండటాన్ని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రశంసించే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం ఆత్మకూరు డిపో గ్యారేజిలో జరిగిన ఈ అభినందన సభకు ఆయన హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం వస్తురవాణాకు సంబంధించి సంస్థతో ఉమ్మడి వ్యాపారం సాగిస్తున్న ఏఎన్‌ఎల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఒప్పందం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ముగియనుందన్నారు. ఆ తరువాత సంస్థాపరంగానే అంతర్గతంగా కార్గో పేరిట వస్తుసేవల్ని రవాణా చేయడం ద్వారా సంస్థకు ఎదురవుతున్న నష్టాల్ని క్రమేపి తగ్గించుకోనున్నట్లు వివరించారు. చిన్నపాటి కవర్ నుంచి ఎంత పెద్ద వస్తువుల్నైనా ఈ వ్యవస్థ ద్వారా వేగంగా, సురక్షితంగా గమ్యానికి చేర్చగలమన్నారు. ఈ ఆర్డర్లు బుక్ చేసే ఉద్యోగులకు ప్రత్యేకంగా కమీషన్ కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. ఆర్టీసీ బస్టాండ్ల ఆధునీకరణపై ప్రత్యేకంగా చొరవ చూపుతున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి వ్యయాన్ని లెక్క చేయక, బస్టాండ్ ఆవరణల్లో మంచి సీట్లను, వినోదకాలక్షేపంగా టీవీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదిలాఉంటే గత ఏడాది సంస్థ నిర్దేశించిన 5.38 కిలోమీటర్ పర్ లీటర్ అధిగమించి 5.53 వరకు తీసుకొచ్చిన డిపో పూర్వ మేనేజర్ కృష్ణారెడ్డి, సిబ్బందిని అభినందిస్తూ కానుకలు అందజేశారు. కార్యక్రమంలో ఇంకా ఆత్మకూరు డిఎస్పీ సుబ్బారెడ్డి, ఆర్‌ఎం జివి రవి వర్మ, డిప్యూటీ సిఎంఇ శ్రీనివాసరావు, డిప్యూటీ సిటిఎం సత్యనారాయణ, ఇన్‌చార్జి డిపోమేనేజర్ వీరాస్వామి, ఏఇ సుభూషణం, డిప్యూటీ ఇఇ మాలకొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.